మెన్స్ క్రికెట్ లో లాగే ఉమెన్స్ క్రికెట్ లో కూడా “గార్డ్” వేసుకుంటారా.? రూల్స్ ఏంటి.?

మెన్స్ క్రికెట్ లో లాగే ఉమెన్స్ క్రికెట్ లో కూడా “గార్డ్” వేసుకుంటారా.? రూల్స్ ఏంటి.?

by Megha Varna

Ads

క్రికెట్ క్రేజ్ ఈమధ్య ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతుంది.దాని ఫలితంగానే బిగ్ బ్యాష్,క్యారిబియన్ లీగ్, ఐ.పి.ఎల్ వంటి లీగ్స్ కు భారీ ఎత్తున యాడ్స్,స్పాన్సర్స్ ఎగబడుతున్నారు.క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువున్న దేశాలలో ఒకటైన భారత్ లో ప్రస్తుతం మెన్స్ క్రికెట్ కున్న క్రేజ్ ఉమెన్స్ క్రికెట్ కు లేదు.ఈ విషయం అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ మెన్స్ క్రికెట్ టీమ్ కున్న క్రేజ్ ను ఉమెన్ క్రికెట్ టీమ్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.అందులో భాగంగా ఉమెన్ ఐపీఎల్ ను ప్రారంభించింది.అలాగే మెన్ క్రికెటర్స్ చేత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయిస్తుంది.ఆ ప్రయత్నాలు బాగానే ఫలించినట్టున్నాయి.అందుకే ఈమధ్య ఉమెన్ క్రికెట్ మ్యాచ్ లకు మంచి రేటింగ్స్ వస్తున్నాయి.

Video Advertisement

 

ఇక మెన్ క్రికెట్ ప్లేయర్స్ లాగే ఉమెన్ క్రికెట్ ప్లేయర్స్ కూడా గ్రౌండ్ లో అన్ని లగ్జరీస్ ను అలాగే వేగంగా తనపైకి దూసుకొస్తున్న బాల్ నుండి తమ ప్రైవేట్ పార్ట్స్ ను రక్షించేందుకు గార్డ్స్ ఖచ్చితంగా ధరిస్తారు.అందులో మొదటిది చెస్ట్ గార్డ్ దీన్ని మెన్స్ కూడా ధరించవచ్చు కాని ఇది ధరించి కంఫర్టబుల్ గా ఆడలేమనే ఉద్దేశంతో మెన్స్ చెస్ట్ గార్డ్ ను పక్కన పెట్టారు.కాని ఉమెన్ ప్లేయర్స్ మాత్రం తమ చెస్ట్ కాపాడుకోవడానికి దీన్ని ధరించడాన్ని ఖచ్చితం చేశారు.అలాగే మెన్స్ లోవర్ గార్డ్ ధరించిన విధంగానే ఉమెన్స్ కూడా లోవర్ గార్డ్ ధరిస్తారు.వాటిని అబ్డోమెన్ ప్రొటెక్టర్ లేదా అబ్డోమెన్ గార్డ్ అని పిలుస్తారు.ఈ అబ్డోమెన్ ప్రొటెక్టర్ ను ఉమెన్ క్రికెటర్స్ బ్యాటింగ్,ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఉపయోగిస్తారు.

మెన్స్ తో పోలిస్తే ఉమెన్ క్రికెట్ లో బౌండరీలు,సర్కిల్ చిన్నవిగా ఉంటాయి.ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే t20 ఫార్మాట్ లో భారత్ తరుపున తొలి రెండు వేల పరుగుల మార్క్ ను అందుకున్నది ఒక ఉమెన్ క్రికెటర్ అమే మిథాలీ రాజ్.ఈమె తర్వాతనే కోహ్లీ,రోహిత్ ఆ మార్క్ ను అందుకున్నారు. 2003 లో అర్జున అవార్డుని, 2015 లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు మిథాలీ రాజ్.


End of Article

You may also like