కళ్యాణ్ జీ గోగన దర్శకత్వంలో పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “సుందరి ” .
ఈ చిత్రానికి రిజ్వాన్ నిర్మాతగా ఉన్నారు.ఈసినిమా మరి కొద్దీ రోజుల్లో ఆగష్టు 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ని చిత్ర యూనిట్ విడుదల చేశారు.

purna
ఈ సినిమా పోస్టర్ లో పూర్ణ పెళ్లి కూతురు గెటప్ లో కనువిందు చేస్తున్నారు. సుందరి ఎవరు ? అందం ఆమె పాలిట శాపం ఎలా అయింది అనే పాయింట్ మీద సినిమా తెరకెక్కుతున్నట్టు నిర్మాత పేర్కొన్నారు. ఇక ఈ సినిమా లో పూర్ణ నటన హైలెట్ గా నిలుస్తుంది అని తెలుస్తోంది. అంబటి అర్జున్,రాకేందు మౌళి ఇతర ముఖ్య పాత్రలలో కనువిందు చేయనున్నారు. మొత్తానికి పూర్ణ పెళ్లి గెటప్ తో అందరిని మెప్పిస్తున్నారు. ఇంకా సినిమా లో పూర్ణ నటన చూడాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.