Nayanthara: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అనగానే గుర్తొచ్చే పేరు నయనతార. నయనతార మలయాళంలో మనస్సినక్కరే అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
Video Advertisement
ఈ మూవీలో హీరో జయరామ్. 2005లో వచ్చిన తమిళంలో అయ్యా, రజనీకాంత్ చంద్రముఖి మూవీ నయనతారకు మంచి విజయాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత నయనతార నటించిన గజిని, లక్ష్మి, బాస్, యోగి సినిమాలు ఆమెను తమిళ మరియు తెలుగు సినీ పరిశ్రమల్లో బిజీ నటిగా మార్చాయి. అగ్ర నటులందరితోనూ నటించి, మెప్పించింది. సౌత్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ నయనతార.సినిమాల ద్వారా ఎంతో పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న నయనతార ఇటీవల తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని వివాహం చేసుకుంది.పెళ్లి అయిన నెలకే సరోగసి ద్వారా తల్లి అయ్యి వార్తల్లో నిలిచింది. నయన్ ఆస్తుల విలువ దాదాపు రూ. 100 కోట్లు అని అంచనా. దక్షిణ భారతదేశంలోని అత్యంత ధనిక హీరోయిన్స్ లో ఒకరు. ఆమెకు చెన్నైలో విలాసవంతమైన విల్లాలు, అపార్ట్‌మెంట్లు, విలాసవంతమైన కార్లు మరియు ప్రైవేట్ జెట్ కూడా ఉన్నాయి.
నయనతారకు ఉన్న 8 ఖరీదైన వస్తువుల జాబితా ఏంటో చూద్దాం..
1. రౌడీ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ విలువ రూ. 50 కోట్లు
నయనతార మరియు విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్‌ను మొదలుపెట్టారు. ఇది 50 కోట్ల రూపాయల విలువ ఉన్న నిర్మాణ సంస్థ.2. విలువైన ఆస్తులు
నయన్ హైదరాబాద్, చెన్నై, ముంబైలలో 4 BHK అపార్ట్‌మెంట్‌లతో సహా రూ. 100 కోట్ల ఆస్తి ఉంది.3.కాస్మెటిక్ బ్రాండ్ ‘ది లిప్ బామ్ కంపెనీ’
కాస్మెటిక్ సర్జన్ అయిన రెనితా రాజన్‌తో కలిసి నయనతార కాస్మెటిక్ బ్రాండ్ ‘ది లిప్ బామ్ కంపెనీ’స్టార్ట్ చేసింది. దీని విలువ రూ.10 కోట్లు4. ప్రైవేట్ జెట్
నయనతార & విఘ్నేష్ శివన్ లకు రూ. 50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌ను ఉన్నట్లు తెలుస్తోంది.5. మెర్సిడెస్ GLS 350D
రూ. 88 లక్షల విలువ కలిగిన మెర్సిడెస్ GLS 350D ఉంది.6.BMW 7-సిరీస్ ధర రూ. 1.76 కోట్లు
7.టయోటా ఇన్నోవా క్రిస్టా విలువ రూ. 30 లక్షలు
8. రూ. 74.50 లక్షల విలువైన BMW 5 సిరీస్
These 8 Expensive Things Owned By Nayanthara Shows The Luxurious Side Of Lady Superstar