F3 Review : “వెంకీ-వరుణ్” కలిసి మరొక సారి హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

F3 Review : “వెంకీ-వరుణ్” కలిసి మరొక సారి హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya
  • చిత్రం : F 3 (ఎఫ్ 3)
  • నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్, సునీల్.
  • నిర్మాత : దిల్ రాజు
  • దర్శకత్వం : అనిల్ రావిపూడి
  • సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
  • విడుదల తేదీ : మే 27, 2022

f3 movie review

Video Advertisement

స్టోరీ :

మురళీ శర్మ పాత్రతో సినిమా మొదలవుతుంది. వెంకీ (వెంకటేష్), వరుణ్ యాదవ్ (వరుణ్ తేజ్) చాలా సాధారణమైన మనుషులు. డబ్బు కోసం పోరాడుతూ ఉంటారు. ఒకరోజు విజయనగరంలో ఉన్న ఒక పారిశ్రామికవేత్త (మురళీ శర్మ) తన వారసుడి కోసం వెతుకుతున్నాడు అని తెలుస్తుంది. వెంకీ, వరుణ్ తామే ఆయన వారసుడు అని నమ్మించి ఆ డబ్బులు అన్ని వారి సొంతం చేసుకోవాలి అని అనుకుంటారు. దీని కోసం వెంకీ, వరుణ్ వెళ్లి ఏం చేశారు? అక్కడ వారికి ఎదురైన సంఘటనలు ఏంటి? చివరికి వారు డబ్బు సంపాదించారా? వారి సమస్యల నుండి ఎలా బయట పడ్డారు? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

f3 movie review

రివ్యూ :

కొంతకాలం క్రితం వచ్చిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో వెంకటేష్ కామెడీ సినిమా మొత్తానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. తర్వాత దాని సీక్వెల్ వస్తుంది అనగానే ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. మొదటి భాగం విడుదల అయిన మూడు సంవత్సరాలకి ఈ సినిమా విడుదల అయ్యింది. దాదాపు మొదటి భాగంలో చూసిన పాత్రలు అందరూ కూడా ఈ సినిమాలో ఉంటారు. సినిమా మొదటి భాగానికి కొనసాగింపు కాదు. కొత్త కాన్సెప్ట్ తో సినిమా నడుస్తుంది.

కానీ మెయిన్ పాయింట్ మాత్రం కామెడీ. చాలా మంది డబ్బు కోసం ఎదుర్కొనే సమస్యలను ఈ సినిమాలో కామెడీతో చూపించారు. చాలా వరకు అది వర్కౌట్ అయ్యింది. సినిమాకి మొదటి హైలైట్ మాత్రం వెంకటేష్. రేచీకటి ఉన్న పాత్రలో వెంకటేష్ నటన కామెడీ ఈ సినిమాకి ఒక హైలైట్ గా నిలిచింది. వెంకటేష్ లోని కామెడీ టైమింగ్ ని వాడుకోవడంలో అనిల్ రావిపూడి చాలా వరకూ సక్సెస్ అయ్యారు. అలాగే వరుణ్ తేజ్ కూడా నత్తి ఉన్న పాత్రలో బాగా నటించారు. కొన్ని చోట్ల వరుణ్ తేజ్ కామెడీ కూడా బాగా కనిపిస్తుంది. వీరిద్దరి తర్వాత సినిమాకి అంత హైలైట్ అయిన పాత్రలు మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్. అలాగే సునీల్ కి కూడా చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి పాత్ర పడింది అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ పాత్ర కూడా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది.

f3 movie review

ఇంక హీరోయిన్స్ విషయానికొస్తే, హారికగా తమన్నా, హనీగా మెహరీన్, సోనాల్ చౌహాన్ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సహాయ పాత్రల్లోనూ నటించిన ప్రగతి, అన్నపూర్ణ, వై విజయ మిగిలిన వారు కూడా సినిమాలో కామెడీ కనిపించడానికి తమ వంతు కృషి చేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. కానీ కథ విషయంలో మాత్రం కొంచెం బలహీనంగా ఉంటుంది. సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. కానీ ఆ మెసేజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో వచ్చే కొన్ని సీన్స్ మాత్రం చాలా రొటీన్ గా అనిపిస్తాయి. అక్కడక్కడ కామెడీ కూడా ఎక్కువ అయిందేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రం సినిమా మొదటి నుండి చివరి వరకు అలాగే సాగుతుంది.

ప్లస్ పాయింట్స్ :

  • వెంకటేష్
  • కామెడీ
  • ఎంటర్టైన్మెంట్
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

  • బలహీనమైన కథ
  • అక్కడక్కడ సాగదీసినట్టు అనిపించే కొన్ని సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

కథలో కొత్తదనం ఉండాలి, సినిమా చాలా డిఫరెంట్ గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయకుండా, ఒక కామెడీ ఎంటర్టైనర్ చూడాలి, అందులోనూ చాలా రోజుల తర్వాత వెంకటేష్ మళ్లీ ఒక కామెడీ సినిమా చేశారు అని అనుకొని వెళ్లే ప్రేక్షకులని మాత్రం ఎఫ్3 అస్సలు నిరాశపరచదు.


You may also like