అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..?

అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..?

by kavitha

Ads

థియేటర్స్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఏషియన్ సినిమాస్ హైదరాబాద్ లో టాలీవుడ్ స్టార్ హీరోలతో పార్టనర్ షిప్  ద్వారా మల్టిప్లెక్స్ లు నిర్మిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే గచ్చిబౌలి ప్రాంతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏఎంబి సినిమాస్ ను నిర్మించారు.

Video Advertisement

మహబూబ్ నగర్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఏవిడి సినిమాస్ ను ఏషియన్ సంస్థ అధినేత సునీల్ నారంగ్ ప్రారంభించారు. తాజాగా ఏషియన్ సినిమాస్ అల్లు అర్జున్ తో కలిసి ఏఏఏ సినిమాస్ ను అమీర్ పెట్ ప్రాంతంలో ప్రారంభించారు. ఈ మల్టిప్లెక్స్ లోని ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. Allu-Arjun-Multiplex-Theatreఏషియన్ మల్టిప్లెక్స్ థియేటర్స్ లో మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ కి ఆడియెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ పొందింది. హైదరాబాద్ లో ఏఎంబి సినిమాస్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇటీవల ఏషియన్ సినిమాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పార్టనర్ షిప్ తో ఏఏఏ సినిమాస్ అమీర్ పెట్ లో నిర్మించారు. తాజాగా ఈ మల్టిప్లెక్స్ థియేటర్ ను ప్రారంభించారు. ఈ వేడుకకు తెలంగాణ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు.
అమీర్ పెట్ లో ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన సత్యం థియేటర్ ని పడగొట్టి, ఏఏఏ సినిమాస్ ని నిర్మించారు. 3 లక్షల స్క్వేర్ ఫీట్ లో దీనిని నిర్మించారు. పార్కింగ్ కోసం 2 ఫ్లోర్స్ ని కేటాయించారంట. ఇందులో మొత్తం 5 స్క్రీన్ లు ఉండగా, ఒక్కో స్క్రీన్ 1 67 ఫీట్ల పొడవుతో బార్కో లంజెర్ ప్రొజెక్షన్ తో చిత్రాలను ప్రదర్శిస్తారని తెలుస్తోంది.
రెండవ స్క్రీన్ ఎపిక్ లక్సన్ స్క్రీన్. ముంబైలో తప్ప ఎక్కడ ఈ LED స్క్రీన్ లేదట. ఏఏఏ సినిమాస్ ద్వారా ఈ టెక్నాలజీని మొదటిసారిగా హైదరాబాద్ కి పరిచయం చేస్తున్నారు. ఇక ఈ స్క్రీన్ కి ప్రొజెక్టర్ తో పని లేదంట. కనెక్షన్ ద్వారానే మూవీ ప్లే అవుతుంది. మిగిలిన 3 స్క్రీన్స్ 4K ప్రొజెక్షన్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం కలిగి ఉంటుందట. ఆడియెన్స్ కి మూవీ చూస్తే ఇలాంటి థియేటర్ లోనే చూడాలనే అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు.

Also Read: “అసలు ఈ 2 సీన్స్ ఏంటి…?” అంటూ… “ఆదిపురుష్” పై ట్రోల్స్..! అవి ఏంటంటే..?


End of Article

You may also like