Arjun: హీరో అర్జున్ భార్య మన తెలుగు హీరోయినే.. ఎవరో తెలుసా..?

Arjun: హీరో అర్జున్ భార్య మన తెలుగు హీరోయినే.. ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

హీరో అర్జున్ వాస్తవానికి తమిళ నటుడు అయినా, తెలుగు నాట కూడా అర్జున్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అర్జున్ దాదాపు 130 సినిమాలలో నటించాడు. “మా పల్లెలో గోపాలుడు” సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అర్జున్ “జెంటిల్ మెన్”, “శ్రీ మంజునాథ” సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత గా చేరువయ్యాడు.

Video Advertisement

 

హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రా చెల్లి, శ్రీఆంజనేయం, స్వాగతం, రామ రామ కృష్ణ కృష్ణ వంటి సినిమాలతో అర్జున్ తెలుగునాట తిరుగులేని నటుడు గా పేరు తెచ్చుకున్నాడు. హీరో గానే కాకుండా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అర్జున్ కు మంచి పేరు ఉంది.

arjun wife 1
అర్జున్ భార్య గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె పేరు నివేదిత. ఆమె సీనియర్ నటుడు రాజేష్ కుమార్తె. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచే వచ్చిన నివేదిత 1986 లో కొన్ని సినిమాలలో కూడా నటించింది. 1986 లో వచ్చిన రధ సప్తమి సినిమా నివేదితకు మొదటి సినిమా. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. నివేదిత ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. 1988 లో డాక్టర్ గారబ్బాయి సినిమాలో నటించింది. ఇందులో అర్జున్ హీరో గా నటించారు.

arjun wife 2

ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారం తో వీరిద్దరూ ఒక్కటయ్యారు. బెంగళూర్ నుంచి చెన్నై కి షిఫ్ట్ అయిపోయారు. అయితే.. వైవాహిక జీవితం ఆనందంగా గడపడం కోసం వీరిద్దరిలో ఒక్కరే నటించాలని నిర్ణయించుకున్నారు. అందుకే నివేదిత సినిమాలకు దూరమైంది.


End of Article

You may also like