బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ (ఉత్తమ పాట) విభాగంలో ‘నాటు నాటు’కు 95వ ది అకాడమీ అవార్డ్ వచ్చింది. తొలి భారతీయ సినిమా పాటగా నాటు నాటు పాట చరిత్ర ని సృష్టించింది. భారత దేశం లో వున్న వారంతా ఎంతో గర్వ పడుతున్నారు. లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ సంగీతానికి ఎం.ఎం. కీరవాణి అవార్డు అందుకున్నారు.

Video Advertisement

బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగం లో బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా అవార్డు ఇచ్చారు. ఇప్పుడు ఆస్కార్ అవార్డు వచ్చింది.

the story behind RRR 'natu natu' song..!!

నాటు నాటు పాట కి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ. అందించారు. చంద్రబోస్ లిరిక్స్ ని ఇచ్చారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీత దర్శకుడు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఇద్దరు ఈ పాటని పాడారు. అయితే చాలా మందికి ఈ పాట కి సంబంధించి ఈ విషయాలు తెలీవు. ఇవి చూస్తే మీరు షాక్ అవుతారు.

#1. 90% పాటను చంద్రబోస్ సగం రోజు లో పూర్తి చేసారు. కానీ మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి 19 నెలలు టైం పట్టింది.

#2. ఈ ట్రాక్ ని ఫైనల్ చేసేందుకు 19 నెలలు కంటే ఎక్కువ టైం పట్టింది.

#3. కీరవాణి 20 కంటే ఎక్కువ ట్యూన్‌లు ఆయన తీసుకు వచ్చారు. ఓటింగ్ ప్రక్రియ ద్వారా దీన్ని ఫైనల్ చేసారు.

#4. హుక్ స్టెప్ కి దాదాపు 110 మూవ్‌లను కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తీసుకు వచ్చారు. రాజమౌళి దీన్ని ఫైనల్ చేసారు.

#5. ఈ సాంగ్ లో కనపడే ప్యాలెస్ కైవ్‌ లోని ఉక్రెయిన్ అధ్యక్షుడు మారిన్స్కీ ప్యాలెస్.

#6. ఈ పాట షూట్ చేసేందుకు 15 రోజులు పట్టింది. 350 మందికి పైగా ఈ సాంగ్ లో వున్నారు.
రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ తో 18 సార్లు హుక్ స్టెప్ వేయించారు. రెండవ టెక్ లో సింక్ బాగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఎనభై వేరియేషన్స్ ఈ హుక్ స్టెప్ లో వున్నాయి.

memes on RRR win oscar for 'natu natu' song..

#7. నాటు నాటు పాట ని కీరవాణి ఆయన కొడుకుగా భావించారు. అప్పుడు పాట ఉయ్యాలలో చంటి పిల్లాడిలాగ ఇప్పుడు తండ్రిని గర్వపడేలా చేసిన కొడుకు అని కీరవాణి అన్నారు.

#8. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును పొందిన మొదటి ఏషియన్ పాట ఇది.