పవన్ ధరించిన ఈ రంగు ఉంగరాలను గమనించారా? దీని వెనుక అసలు కారణం ఏంటో తెలుసా?

పవన్ ధరించిన ఈ రంగు ఉంగరాలను గమనించారా? దీని వెనుక అసలు కారణం ఏంటో తెలుసా?

by Anudeep

Ads

పవన్ కళ్యాణ్.. తెలుగు రాష్ట్రాల సినీ ప్రేమికులకు, రాజకీయ రంగానికి పరిచయం అవసరం లేని పేరు. పవర్ స్టార్ గా సినీ కెరీర్ లో మంచి ఊపు మీద ఉన్న సమయంలోనే సినిమాలను వదిలిపెట్టి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తనకు చేతనైనంత సాయం చేస్తూ ప్రజా నాయకుడిగా ఎదగాలని ప్రయత్నించారు. అయితే కాలం కలిసి రాలేదు. తననే నమ్ముకున్న అభిమానుల కోసం తిరిగి సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చారు.

Video Advertisement

అయితే పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ రాజకీయాలపై ఉన్న మక్కువని వదలలేదు. తిరిగి పార్టీ కోసం పని చేయడం ప్రారంభించారు. అయితే.. పార్టీ తరపున ఆయన పలు ప్రెస్ మీట్స్ లో కూడా పాల్గొన్నారు.

pawan 1

అయితే మీరెప్పుడైనా గమనించారా? పవన్ కళ్యాణ్ తన చేతికి రెండు ఉంగరాలని ధరించి కనిపిస్తారు. సాధారణంగా పూర్తి రాజకీయ నాయకుడి తరహా లో పవన్ కళ్యాణ్ తెలుపు చొక్కా, తెలుపు పంచెని మాత్రమే ధరిస్తారు. అయితే.. ఆయన రంగు ఉంగరాలను ధరించడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఈ ఉంగరాల గురించి అభిమానుల మధ్య కూడా జోరుగా చర్చ సాగుతోంది. 2024 లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారు అన్న సంగతి ఇంకా తేలాల్సి ఉంది.

pawan 2

ఈ క్రమంలో పవన్ ఉంగరాలు ధరించి ప్రెస్ మీట్స్ కి వస్తుండడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ కుతూహలం నెలకొంది. ఓ వైపు ఆయన అభిమానులు కూడా ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయంగా తనకు అనుకూలించడం కోసమే పవన్ ఈ ఉంగరాలను ధరిస్తున్నారట. పవన్ ధరించిన ఉంగరాల్లో ఒకటి పగడం అని తెలుస్తూనే ఉంది. సాధారణంగా వైవాహిక జీవితంలో వచ్చే సమస్యల్ని అధిగమించడానికి కూడా పగడాన్ని ధరిస్తుంటారు. అయితే.. పవన్ కళ్యాణ్ రాజకీయంగా అడ్డంకులు తొలగి తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసమే ధరిస్తున్నారని సన్నిహితుల మాట.

pawan

పవన్ కళ్యాణ్ కు నమ్మకాలూ ఎక్కువేనని ఆయన సన్నిహితులు కూడా చెబుతుంటారు. త్రివిక్రమ్ ద్వారా ఆయన ఉపనయనం కూడా చేయించుకుని జంధ్యం ధరిస్తున్నారని సమాచారం. అలాగే ఆయన హోమాలు చేయించడం కోసం భారీగా ఖర్చులు చేయిస్తారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో రూపొందుతోంది. ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.


End of Article

You may also like