Ads
టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ ని తలుచుకున్నప్పుడల్లా మనకు ఒకలాంటి బాధ కలుగుతూ ఉంటుంది. ఎవరి సపోర్ట్ లేకుండా చిన్న వయసు లోనే స్టార్ గా ఎదిగి.. ఆ తరువాత పరిస్థితులు కలిసిరాక ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయాడు. ఎందరికో ఇన్స్పిరేషనల్ గా నిలిచినా ఉదయ్ కిరణ్ చివరికి అలా వెళ్లిపోవడం అందరికి బాధ కలిగించే విషయమే. ఈరోజు ఉదయ్ కిరణ్ పుట్టినరోజు.. ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయినా తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉదయ్ కిరణ్ ని ఇంకా మర్చిపోలేదు. ఓ ఇంటర్వ్యూ లో ఆయన అక్క శ్రీదేవి ఉదయ్ కిరణ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Video Advertisement
ఉదయ్ కిరణ్ కి షార్ట్ టెంపర్, కోపం లాంటివి ఉన్నాయా అని అడిగినపుడు.. ఆయన అక్క ఇలా సమాధానమిచ్చారు.. కోపం అంటే ఎప్పుడు వచ్చేది కాదని.. కానీ అంత చిన్న వయసు లోనే తాను చాలా టెన్సన్స్ ని హోల్డ్ చేసుకునేవాడని తెలిపారు. ఫిలిం లైఫ్ లో వచ్చే ఎన్ని టెన్షన్లు అయినా తానొక్కడే భరించేవాడని.. తనతో కానీ, అమ్మ తో గాని అంత గా షేర్ చేసుకునే వాడు కాదని చెప్పుకొచ్చారు. ఎప్పుడైనా ఒక్కోసారి ఆ టెన్సన్స్ బరస్ట్ అయిపోయినపుడు కొంచం షార్ట్ టెంపర్ గా ఉండేవాడని చెప్పారు.
కానీ.. అమ్మని కానీ, మమ్మల్ని కానీ, పిల్లలని కూడా చాలా ప్రేమ గా చూసుకునేవారని చెప్పుకొచ్చారు. చాలా ఎమోషనల్ గా ఉండేవాడని.. ఎప్పుడు వచ్చిన రాత్రి ఎక్కువ గా తనతో టైం స్పెండ్ చేసే వాడని చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఇంటికి వచ్చినా రాత్రి అంతా నిద్ర పోకుండా కబుర్లు చెప్పుకునే వారమని గుర్తు చేసుకున్నారు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే.. సూర్యుడు ఉదయించడం కూడా అయిపోయేది అని చెప్పుకొచ్చారు.
అలాగే, ఉదయ్ కిరణ్ కి లాంగ్ డ్రైవ్స్ అంటే కూడా బాగా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఎవరైనా పక్కన కూర్చుంటే చాలని.. డ్రైవ్ చేస్తున్నపుడు పక్కన నిద్రపోతే ఒప్పుకోడని చెప్పుకొచ్చారు. డ్రైవ్ ని , మ్యూజిక్ ని ఎంజాయ్ చేయమని చెప్పేవాడని గుర్తు చేసుకున్నారు. ఓసారి నైట్ ఇలానే మాట్లాడుకుంటున్నపుడు కూడా విషిత గురించి చెప్పాడని తెలిపారు. ఓవర్ నైట్ ఆమెను పొగుడుతూ కళ్ళ నీళ్లు పెట్టేసుకున్నాడని గుర్తు చేసుకున్నారు.
ఆ అమ్మాయి గురించి మాట్లాడుతూ కళ్ళల్లో నీళ్లు అలా వచ్చేస్తున్నాయి. పెళ్ళికి ముందు రోజు రాత్రి ఇలా ఆమె గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు. అంత ప్రేమించాడు ఆ అమ్మాయిని.. అంటూ ఎమోషనల్ అయ్యారు. ఉదయ్ కిరణ్ గురించి ఆయన అక్క శ్రీదేవి పంచుకున్న విషయాలని మీరు ఈ వీడియో లో చూడవచ్చు.
Watch Video:
End of Article