ఒక ప్రమాదకరమైన ప్రకటన 3 గంటల సినిమా అయితే..? ఈ సినిమా చూశారా..?

ఒక ప్రమాదకరమైన ప్రకటన 3 గంటల సినిమా అయితే..? ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

ఫ‌హాద్ ఫాజిల్‌, సౌత్ ఇండస్ట్రీలో వెర్స‌టైల్‌ యాక్ట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంలో విలక్షణమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో తన చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేసి నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. ఒక వైపు హీరోగా చేస్తూనే, పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్, విల‌న్ అనే తేడా లేకుండా నటిస్తున్నాడు.

Video Advertisement

ఇటీవల ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన ‘ధూమం’ అనే మ‌ల‌యాళ చిత్రం థియేట‌ర్ల‌లో విడుదల అయ్యింది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను హోంబలే ఫిలింస్ నిర్మించింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
dhoomam-movieమాలయళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్‌ చేసే పాత్ర ఏదైనా అద్భుతంగా నటిస్తాడనే విషయం తెలిసిందే. రీసెంట్ గా ఫ‌హాద్ ఫాజిల్ ‘ధూమం’ అనే మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీని యూటర్న్ మూవీ దర్శకుడు పవన్ కుమార్ తెరకెక్కించాడు. కేజీఎఫ్ మూవీ నిర్మాణ సంస్థ అయిన హోంబ‌లే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మించింది. ఈ చిత్రంలో అప‌ర్ణ బాల‌ముర‌ళి, రోష‌న్ మాథ్యూ ముఖ్యమైన పాత్ర‌లలో న‌టించారు. ధూమం సినిమాను సందేశాత్మక క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా తెర‌కెక్కించారు. ఈ సినిమా జూన్‌ 23న థియేటర్లలో రిలీజైంది.
ధూమం కథ విషయనికి వస్తే, ఒక సిగ‌రెట్ కంపెనీలో అవినాష్ (ఫ‌హాద్ ఫాజిల్‌) సేల్స్ హెడ్‌గా వర్క్ చేస్తూ, తన  టాలెంట్ తో, మార్కెటింగ్ స్ట్రాట‌జీస్‌తో ఆ కంపెనీ సేల్స్ ను అధికంగా పెంచుతాడు. దాంతో అవినాష్‌ను ఆ కంపెనీ ఎమ్‌డీ సిద్ధార్థ్ (రోష‌న్ మాథ్యూ) ఉద్యోగిల కాకుండా ఫ్రెండ్ ల చూస్తుంటాడు. అయితే అవినాష్ సిద్దార్థ్ తో అభిప్రాయ భేదాలు రావడంతో సడెన్ గా జాబ్ కి రిజైన్ చేస్తాడు. నెక్స్ట్ డే అవినాష్ త‌న భార్య దియా (అప‌ర్ణ బాల‌ముర‌ళి)తో కలిసి కారులో వెళ్తుండగా అత‌డి పై ఒక ముసుగు వ్య‌క్తి దాడి చేసి డ్ర‌గ్ ఇంజెక్ష‌న్స్ అవినాష్ కి ఇస్తాడు.
డ్ర‌గ్ ఎఫెక్ట్ నుండి అవినాష్ బ‌య‌ట‌కు వ‌చ్చేస‌రికి ఒక కొండ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తిస్తాడు. అప్పుడు ఒక అప‌రిచితుడు అవినాష్‌ కు ఫోన్ చేసి. దియా బాడీలో ఓ మైక్రో బాంబ్ పెట్టామని, ఆ బాంబ్ పేలితే దియా ప్రాణాలు పోతాయని, అలా జరగకూడదు అంటే తెము చెప్పినట్టు వినాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. కోటి రూపాయ‌ల్ని అతను చెప్పిన దగ్గర ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. త‌న‌ను ఫోన్‌లో బెదిరిస్తోన్న వ్యక్తి ఎవరో అవినాష్ క‌నిపిపెట్టాడా? త‌న భార్యను కాపాడుకున్నాడా? ఆ ట్రాప్ నుంచి అవినాష్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? అనేది మిగతా కథ. ధూమం సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాల‌నుకున్న మెసేజ్ బాగున్నప్పటికీ, చెప్పిన విధానంలో క‌న్ఫ్యూజ‌న్‌ ఎక్కువగా  ఉంది. సాధారణంగా సినిమా మొదలయ్యే ముందు వచ్చే ముఖేష్ యాడ్ ని వివరంగా చూపించినట్టు అనిపిస్తుంది. ఫ‌హాద్ ఫాజిల్ ట్రాప్‌లో ఇరుక్కుకోవ‌డం మరియు ట్రాప్ నుండి బ‌య‌ట‌ప‌డే సీన్స్ లో థ్రిల్లింగ్ మిస్ అవడమే కాకుండా రిపీటెడ్ సన్నివేశాలతో చాలా స్లోగా సాగుతాయి. విల‌న్ ఎవ‌ర‌నేది ఊహించే విధంగా ఉంటుంది. ఈ మూవీ ఫ‌హాద్ వ‌న్ మెన్ షో అని చెప్పవచ్చు. అవినాష్ క్యారెక్టర్ లో ఫ‌హాద్ ఫాజిల్ జీవించాడు. సింపుల్ కథని త‌న నటనతో నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నించాడు.

Also Read: దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ లో నష్టాలు తెచ్చిన ఏకైక సినిమా ఏమిటో తెలుసా..?


End of Article

You may also like