Ads
మలయాళం సినిమాలు అంటే సహజంగా ఉంటాయి అని, అందులోనూ మంచి కంటెంట్ ఉంటుంది అని పేరు. ఇది వరకు తెలుగులో తమిళ్ సినిమాలు మాత్రమే ఎక్కువగా విడుదల అయ్యేవి. కానీ ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాలకు మార్కెట్ బాగా పెరిగింది. ఇదే విధంగా ఇప్పుడు మలయాళంలో వచ్చిన ‘పచ్చువుం అద్భుత విళక్కుం’ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు డబ్బింగ్ రూపంలో వచ్చింది. ‘పుష్ప’ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఫహాద్ ఈ చిత్రం లో హీరోగా నటించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : పచ్చువుం అద్భుత విళక్కుం
- నటీనటులు : ఫహాద్ ఫాజిల్, అంజనా జయప్రకాష్, వీజీ వెంకటేష్, ధ్వని రాజేష్, ఛాయా కదమ్, ముఖేష్, ఇన్నోసెంట్, శాంతి కృష్ణ, అల్తాఫ్ సలీం
- నిర్మాత : సేతు మన్నర్కాడు
- దర్శకత్వం : అఖిల్ సత్యన్
- సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
- విడుదల తేదీ : మే 28 , 2023
- ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్
స్టోరీ:
కేరళకు చెందిన ప్రశాంత్ (ఫహాద్ ఫాజిల్) ముంబయిలో ఓ ఆయుర్వేద మెడికల్ స్టోర్‌ను రన్ చేస్తుంటాడు. ముప్పై ఏళ్లు దాటినా పెళ్లికాదు. ప్రేమించిన అమ్మాయి అతడిని కాదని వెళ్లిపోతుంది. ఒకసారి బిజినెస్ పనులతో పాటు తండ్రిని చూసేందుకు ప్రశాంత్ కేరళ వెళ్తాడు. అతడు తిరిగి ముంబయి రావాల్సిన ఫ్టైట్ మిస్సవుతుంది.
అప్పుడు మెడికల్ షాప్ బిల్డింగ్ ఓనర్, బిజినెస్‌మెన్ రియాజ్ (వినీత్) కేరళలో ఉన్న తన తల్లి లైలాను ముంబయికి ట్రైన్‌లో తీసుకురావాల్సిందిగా ప్రశాంత్‌ను సహాయం కోరతాడు. అయితే లైలా మధ్యలో గోవాలోనే ట్రైన్ దిగిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ ప్రశాంత్ కూడా గోవాలో దిగిపోతాడు. ఆ తర్వాత ఏమైంది? ప్రశాంత్‌తో కలిసి ముంబయి బయలుదేరిన లైలా గోవాలో ఎందుకు దిగింది? ప్రశాంత్‌కు గోవాలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? నిధి, హంసధ్వని ఎవరు..? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా..
రివ్యూ:
సింపుల్ ఎమోషన్స్ తో కూడిన లవ్ డ్రామా మూవీగా పచ్చువుమ్ అద్భుత విలక్కుమ్ సినిమాను దర్శకుడు అఖిల్ సత్యన్ అద్భుతంగా తెరకెక్కించాడు. స్వార్థం, ప్రతిఫలాపేక్షతో జీవించే హీరో ఏ విధంగా మంచివాడిగా మారాడు. ప్రేమ గొప్పదనాన్ని ఎలా తెలుసుకున్నాడు అన్నది లవ్, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ మనసుల్ని కదిలించేలా ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్.
ఫహాద్ ఫాజిల్ చెప్పే డైలాగ్స్, అతడి మేనరిజమ్స్ నుంచి కామెడీ వర్కవుట్ అయ్యింది. డైలాగ్స్ బాగున్నాయి. కొన్ని సీన్స్‌ను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఒక్క లోపం మినహా పెద్దగా సినిమాలో మైనస్‌లు లేవు. వినీత్, విజీ వెంకటేష్, ధ్వని రాజేష్‌తో పాటు మిగిలిన వారందరూ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ప్రశాంత్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ జీవించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ పర్లేదు.
ప్లస్ పాయింట్స్
- ఫహద్ ఫాజిల్
- లొకేషన్స్
- కామెడీ
మైనస్ పాయింట్స్
- నిదానంగా సాగే సెకండ్ హాఫ్
- సాగదీసినట్టు ఉండే కొన్ని సన్నివేశాలు
రేటింగ్:
3 /5
ట్యాగ్ లైన్:
ఈ వీకెండ్ కి ఇంట్లోనే కూర్చొని చూడదగ్గ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ..
watch trailer :
Also read: 2018 REVIEW : “టోవినో థామస్” హీరోగా నటించిన 2018 హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article