“KGF”, “కాంతారా” తో పాటు… “తెలుగు” లో కూడా హిట్ సాధించిన 14 కన్నడ సినిమాలు..!

“KGF”, “కాంతారా” తో పాటు… “తెలుగు” లో కూడా హిట్ సాధించిన 14 కన్నడ సినిమాలు..!

by Mohana Priya

Ads

తమిళ్ సినిమాలు ఎప్పుడూ టాలీవుడ్ కి దగ్గరే కానీ కన్నడ సినిమాలు మాత్రం అంతగా టచ్ లేదు తెలుగు ప్రజలకు. తమిళ్ సినిమాలు రీమేక్ లు, డబ్బింగ్ వెర్షన్ లు హిట్ అవుతూనే ఉన్నాయ్ టాలీవుడ్ లో.. అలాగే నటీనటులు కూడా అక్కడి వారు ఇక్కడ.. ఇక్కడి వారు అక్కడ చేయడం పరి పాటి. కానీ కన్నడ సినిమాకు ఎప్పుడు దూరంగానే ఉంది టాలీవుడ్.

Video Advertisement

కానీ కొన్నాళ్ల నుంచి సినీ వ్యాపారపరంగా చిన్న పరిశ్రమగా ముద్రపడ్డ కన్నడ చిత్రసీమ క్రమంగా తన పరిధుల్ని విస్తరిస్తోంది. పాన్‌ ఇండియా కథాంశాలతో దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుతోంది. ‘కేజీఎఫ్‌’ సిరీస్‌ చిత్రాలు అందుకు నాంది పలికాయి. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ నుంచి వచ్చిన ‘కాంతారా’ కన్నడనాట సంచలనాల్ని సృష్టించి తెలుగులో కూడా అదే ఒరవడిని కొనసాగిస్తోంది.

kannada movies became super hits in telugu..

కన్నడ సినిమాలతో పెద్దగా పరిచయం లేని తెలుగు ఆడియన్స్ ని కంటెంట్ తో సర్ ప్రైజ్ చేస్తున్నాయి. అంతకుముందు డబ్ అయినా కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించని కన్నడ సినిమాలపై తెలుగు ఆడియన్స్ ఇప్పుడు మనసు పారేసుకుంటున్నారు.

ఈ నేపథ్యం లో తెలుగులో విడుదలై సూపర్ హిట్ కొట్టిన కన్నడ సినిమాలేంటో చూద్దాం..

#1 కేజీఎఫ్ సిరీస్

కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇది కన్నడ చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో 100 కోట్ల మార్కును దాటిన మొదటి చిత్రం.

#2 కాంతారా

లేటెస్ట్ గా రిషబ్ శెట్టి హీరో, డైరెక్టర్ గా తెరకెక్కిన కాంతారా మూవీ ఇప్పుడు తెలుగులో కూడా హాట్ టాపిక్ అయ్యింది.
పుష్ప, కేజిఎఫ్ రేంజ్ యాక్షన్ మూవీస్ తో కంపేర్ చేస్తూ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్న కాంతారా ఆల్రెడీ కన్నడ లో సూపర్ హిట్ అయ్యింది. ఈ శుక్రవారం తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.

#3 చార్లీ 777

కన్నడ లో సూపర్ హిట్ అయిన మరో కన్నడ మూవీ చార్లీ 777 కూడా తెలుగులో మంచి సక్సెస్ సాధించింది.

#4 అతడే శ్రీమన్నారాయణ

రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన అతడే శ్రీమన్నారాయణ కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

#5 విక్రాంత్ రోనా

కన్నడ స్టార్ సుదీప్ యాక్షన్ ఎంటర్ టైనర్ విక్రాంత్ రోణ కూడా టాలీవుడ్ ని ఆకట్టుకుంది.

#6 జేమ్స్

దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ కూడా తెలుగులో మంచి ఆదరణ దక్కించుకుంది.

#7 ఉపేంద్ర

కేజీఎఫ్ కు ముందు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన కన్నడ నటుడు ఎవరంటే ఉపేంద్ర మాత్రమే. వైవిధ్యమైన కథలు ఎంచుకొనే ఆయన ఉపేంద్ర అనే చిత్రం కూడా తెలుగులో మంచి ఆదరణ దక్కించుకుంది.

#8 పహిల్వాన్

రాజమౌళి తీసిన ఈగ సినిమాలో విలన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కిచ్చా సుదీప్ హీరోగా నటించిన పహిల్వాన్ చిత్రం తెలుగు లో సూపర్ హిట్ అయ్యింది.

#9 రాబర్ట్

కన్నడ స్టార్ దర్శన్ హీరోగా, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రాబర్ట్ చిత్రం కూడా తెలుగులో పోసిటివ్ టాక్ తెచ్చుకుంది.

#10 పోలీస్ స్టోరీ

డైలాగ్ కింగ్ సాయి కుమార్ కి నటుడిగా మంచి పేరు తెచ్చిన పోలీస్ స్టోరీ చిత్రం కూడా కన్నడ చిత్రమే. ఇది తెలుగులో సూపర్ హిట్ అయ్యింది.

#11 బెల్ బాటమ్

కరోనా సమయం లో ఓటీటీ లో విడుదలైన బెల్ బాటమ్ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. తాజాగా కన్నడ సినిమాల క్రేజ్ ని పీక్స్ కి తీసుకెళ్లిన రిషబ్ శెట్టి ఈ చిత్రం లో హీరో.

#12 కోటిగొబ్బ
కన్నడ లో సూపర్ హిట్స్ గా నిలిచిన కోటిగొబ్బ సిరీస్ తెలుగులో కూడా ప్రేక్షకుల ఆదరణను సంపాదించాయి.

#13 ఏ
వైవిధ్యమైన కథలు ఎంచుకొనే ఉపేంద్ర నటించిన మరో చిత్రం ‘ఏ’ కూడా తెలుగులో హిట్ అయ్యింది.

#14 యువరత్న

పునీత్ రాజ్ కుమార్ నటించిన యువరత్న కూడా తెలుగులో మంచి ఆదరణ దక్కించుకుంది.

 


End of Article

You may also like