Ads
సెలెబ్రెటీలకు ఎక్కడ లేని పాపులారిటీ ఉండడం సహజం. హీరోలకు కూడా అభిమానులు ఎక్కువ మంది ఉండడం సంతోషం కలిగించే విషయమే. కానీ, ఒక్కోసారి ఈ అభిమానం మితిమీరినప్పుడే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. తాజాగా తమిళనాట స్టార్ హీరోలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది.
Video Advertisement
అక్కడి ఫ్యాన్ వార్స్ శృతి మించుతున్నాయి. తమిళనాట అభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. వారి అభిమానం ఎక్కువ అయితే గుడి కట్టి మరీ పూజించేస్తుంటారు.
తమ హీరోను ఎవరన్నా పల్లెత్తు మాట అంటే అస్సలు సహించరు. వారికి అంతకు అంతా కౌంటర్లు ఇచ్చేస్తూ ఉంటారు. హీరోల మధ్య బాండింగ్ బాగానే ఉన్నా.. ఫ్యాన్స్ మధ్య మాత్రం నిరంతరం గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కువగా ఈ గొడవలు సోషల్ మీడియాలలోనే జరుగుతూ ఉంటాయి. ట్విట్టర్ లో ఆ టాపిక్ ట్రెండింగ్ లో ఉండడమో లేక సోషల్ మీడియా పోస్ట్ ల కింద కామెంట్స్ లలో కొట్టుకోవడంతో చేస్తూ ఉంటారు.
ఇటీవల తమిళనాట స్టార్ హీరో విజయ్ గుండె పోటుతో మరణించాడు అంటూ ఆయన బతికి ఉండగానే పోస్ట్ లు ట్రెండ్ చేస్తున్నారు. #RIPJOSEPHVIJAY హాష్ టాగ్ తో పోస్టులను ట్రెండ్ చేస్తున్నారు. దీనితో విజయ్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇదంతా అజిత్ ఫ్యాన్స్ చేసిన పని అయి ఉంటుందని భావించి.. వారు అజిత్ ను టార్గెట్ చేసారు. అజిత్ కు ఎయిడ్స్ ఉంది అంటూ పోస్ట్ లు చేస్తున్నారు.
#Aids Patient Ajith అన్న హాష్ టాగ్ ను తెగ వైరల్ చేస్తున్నారు. ఫ్యాన్స్ వార్ మరీ ఈ స్థాయికి దిగజారిపోవడంపై కొంతమంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఫ్యాన్స్ కొట్టుకోవడమే ఒక తప్పు అయితే.. ఎంతో కష్టపడి జీవితంలో పైకి వచ్చిన హీరోలకు లేని పోని రోగాలను అంటకట్టి పోస్టులను ట్రెండ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
End of Article