రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా మెగాస్టార్ చిరంజీవికి మంచి హిట్ ని ఇచ్చింది. చిరంజీవి ఇప్పటికే చాలా మంచి సినిమాలు చేశారు చిరంజీవి హిట్ కొట్టిన సినిమాల్లో ఇంద్ర కూడా ఒకటి. ఇంద్ర సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది.

Video Advertisement

బి గోపాల్ చిరంజీవి కాంబినేషన్లో అశ్వనీత్ ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా కి ప్రశంసలు దక్కడమే కాదు వసూళ్లు, రికార్డులు కూడా వచ్చాయి.

అయితే ఇంత మంచి సినిమా ఇంకా రీ రిలీజ్ అవ్వక పోవడం ఏమిటి అంటూ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా పాత సినిమాలు రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మరి అటువంటి సందర్భంలో చిరంజీవి ఇంద్ర సినిమా ఎందుకు రిలీజ్ అవ్వలేదు అని అంతా అడుగుతున్నారు. కొన్ని నెలల క్రితం ఇదే చర్చ సాగింది. దాంతో నిర్మాణ సంస్థ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చేసింది. పూర్తి నాణ్యత తో ఈ సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పింది. ఇప్పటికే ఈ విషయాన్ని చెప్పి చాలా రోజులైనా కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. చిరంజీవి రాయలసీమ నేపథ్యం లో చేసిన ఫ్యాక్షన్స్ సినిమా ఇంద్ర.

indra movie record

హిందీ లో కూడా ఈ మూవీ హిట్ ని కొట్టింది. ఇంద్ర సినిమా వచ్చి గత ఏడాది తో 20 ఏళ్లు పూర్తయింది దాంతో 4k లో రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. జగదేక వీరుడు అతి లోక సుందరి సినిమా కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం నిజానికి ఈ రెండిటిని రిలీజ్ చేయడం అంత పెద్ద కష్టమేమీ కాదు. మరి ఈ సినిమాలని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.  చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా తో బిజీగా వున్నారు. ఆ సినిమా మీద కూడా ప్రేక్షకులకి అంచనాలు ఎక్కువగా వున్నాయి.