సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన సంఘటన గురించి, ఆయనని కాపాడిన యువకులు మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ అబ్దుల్ ఫర్హాన్ స్పందించారు. వారిద్దరికీ మెగా ఫ్యామిలీ డబ్బులు ఇచ్చింది, బైక్ ఇచ్చింది అంటూ పుకార్లు వస్తున్నాయి. కానీ వారిద్దరూ అలాంటివన్నీ అసత్యం అని చెప్పారు. అసలు వారికి కాపాడేటప్పుడు అతను సాయి ధరమ్ తేజ్ అని తెలియదు అని సమయం కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మహమ్మద్ ఆసిఫ్ ఒక పెయింటర్. సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయినప్పుడు మొహమ్మద్ ఆసిఫ్ అక్కడే ఉన్నారు.3 saidharam tej

బైక్ పై నుండి పడిపోయిన సాయి ధరమ్ తేజ్ ని తన స్నేహితుడు మొహమ్మద్ అబ్దుల్ ఫర్హాన్ సహాయంతో పక్క తీసుకు వచ్చి నీళ్లు తాగించే ప్రయత్నం చేశాడు. ఈ విషయంపై ఆసిఫ్ మాట్లాడుతూ అతను మెగా ఫ్యామిలీకి చెందిన అతను అని తెలియదు అని, కేవలం సాటి మనిషిగానే  సహాయం చేశాము అని చెప్తున్నారు. ఇదే విషయంపై రెండో వ్యక్తి మొహమ్మద్ అబ్దుల్ ఫర్హాన్ కూడా మాట్లాడారు. అతను హైదరాబాద్ లోని నిజాం పేట్ లో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ లో పార్కింగ్ విభాగంలో పనిచేస్తారు.

farhan and asif about saving sai dharam tej

image source : Samayam

సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయినప్పుడు మొదట చూసింది ఇతనే. ప్రమాదం జరిగిన వెంటనే 108కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. కొంత దూరం అంబులెన్స్ వెనకాల వెళ్లారు. సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ సాయి ధరమ్ తేజ్ ఫోన్ ఐ ఫోన్ అవ్వడంతో, అందులోనూ దానికి లాక్ ఉండడంతో వారు సాయి ధరమ్ తేజ్ కుటుంబానికి సమాచారాన్ని అందించలేకపోయారు.

farhan and asif about saving sai dharam tej

image source : Samayam

సాయి ధరమ్ తేజ్ పర్స్ లో చూస్తే కేవలం డబ్బులు మాత్రమే కనిపించాయి. ఆ డబ్బులని కూడా మళ్ళీ తిరిగి పర్స్ లో పెట్టేసి, పోలీసులకి, 108 కి కాల్ చేశారు. ఫర్హాన్ మాట్లాడుతూ తాము ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ కూడా ప్రతిఫలం ఏమీ ఆశించడం లేదు అని, సాయి ధరమ్ తేజ్ కోలుకుంటే అది మాత్రం చాలు అని, ఇప్పటివరకు అసలు మెగా ఫ్యామిలీ నుండి వారికి ఒక్క ఫోన్ కూడా రాలేదు అని, దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు అని చెప్పారు.

watch video :