వ్యవసాయం చేసుకుంటున్న స్టార్ కమెడియన్ కొడుకు..ఇతను ఎవరో తెలుసా.?

వ్యవసాయం చేసుకుంటున్న స్టార్ కమెడియన్ కొడుకు..ఇతను ఎవరో తెలుసా.?

by Mounika Singaluri

Ads

తండ్రికి ఏమాత్రం పరపతి ఉన్నా దానిని వాడేసుకొని ఓ రేంజ్ లో రుబాబులు చేస్తారు చాలామంది కొడుకులు. ఇక తండ్రులు వీఐపీ లు, వీవీఐపీలు అయితే ఆ కొడుకుల చేష్టలు మరింత భరించరానివిగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోయే ఒక స్టార్ కమెడియన్ కొడుకు మాత్రం తండ్రి పేరు బయట పెట్టకుండా పల్లెటూర్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు.

Video Advertisement

ఆ స్టార్ నటుడు తమిళ కమెడియన్ వడివేలు అయితే వ్యవసాయం చేసుకుంటున్నది అతని కొడుకు సుబ్రమణి. కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు కొన్ని వివాదాలు తర్వాత తిరిగి వరుసగా సినిమాలు చేస్తున్నారు.

farmer is a son of star comedian

23వ పులకేసి సినిమా హిట్ అయ్యాక 24వ పులకేసి షూటింగ్ ప్రారంభించిన టైం లో వడివేలు డైరెక్టర్ శంకర్ మధ్య విభేదాలు తలెత్తయి. ఈ నేపథ్యంలోనే వడివేలు పై నిర్మాతల సంఘం నిషేధం విధించింది. చాలా ఏళ్లుగా వడివేలు సినిమాలకు దూరమయ్యారు. ఈ మధ్యనే ఈ సమస్య పరిష్కారం కావడంతో తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు వడివేలు. ఈమద్యే మామన్నన్ లో తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే వడివేలు ఎప్పుడూ ఎక్కడా తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించరు.

farmer is a son of star comedian

ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా పెద్దగా ఎవరికి తెలియవు. అయితే ఈ మధ్య కొడుకు సుబ్రమణి పెళ్లి ఫోటోలు అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో జనాలందరూ ఒకసారిగా షాక్ అయ్యారు అసలు సుబ్రహ్మణ్యం ఎక్కడ ఉన్నారు? కొడుకుని ఎందుకు సినిమాల్లోకి తీసుకురాలేదు అని చర్చలు జరుపుతున్నారు ఈ సందర్భంగా సుబ్రమణి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. వడివేలుకి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు ఇద్దరికీ వివాహాలు అయ్యాయి.

farmer is a son of star comedian

కొడుకు సుబ్రమణ్యం 10 ఏళ్ల క్రితం దగ్గర బంధువుని ఇచ్చి వివాహం చేశారు. తనకి తన తండ్రి అంటే చాలా ఇష్టమని అందుకే తన పిల్లలకి ఆయన పేరే పెట్టుకున్నానని చెప్పుకొచ్చారు. తన తండ్రికి ఏ విషయంలో అయినా సిఫారసు చేయటం ఇష్టం ఉండదు. అందుకే ఎక్కడా తండ్రి పేరు ఉపయోగించను అని చెప్పారు సుబ్రమణి. తండ్రి వారసత్వముగా వచ్చిన పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న సుబ్రమణి తండ్రి సిటీకి రమ్మని పిలిచిన వెళ్లలేదంట. సుబ్రమణి నిజంగా గ్రేట్ కదా.


End of Article

You may also like