తండ్రి తర్వాత కొడుకు సినిమాల్లోకి రావడం చాలా సాధారణం. అయితే తండ్రి, కొడుకు ఒక చిత్రంలో నటించడం అనేది చాలా స్పెషల్ గా ఉంటుంది. పైగా ఆ చిత్రానికి అది చక్కటి ప్లస్ అవుతుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ కి అలా కనబడితే పండగ చేసుకుంటారు.

Video Advertisement

అలా తండ్రి, కొడుకు కలిసి నటించిన సినిమాల గురించి.. ఆ తారల గురించి ఇప్పుడు చూద్దాం.

#1. ఎన్టీఆర్, బాలకృష్ణ:

బాలకృష్ణ ఎన్టీఆర్ తో కలిసి చాలా సినిమాల్లో నటించడం జరిగింది. బాలకృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్ గా తాతమ్మ కల, రామ్ రహీం, దానవీరశూరకర్ణ సినిమాలు చేశారు. అలానే బాలకృష్ణ హీరోగా నటించినప్పుడు కూడా ఎన్టీఆర్ కొన్ని పాత్రలు చేయడం జరిగింది.

#2. మోహన్ బాబు, మంచు మనోజ్:

father and son

మోహన్ బాబు తన కొడుకు మంచు మనోజ్ తో ఝుమ్మంది నాదం, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలు చేశారు.

#3. మోహన్ బాబు, మంచు విష్ణు:

మోహన్ బాబు, మంచు విష్ణు గేమ్, పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ సినిమాల్లో కలిసి నటించారు.

#4. ఏఎన్ఆర్, నాగార్జున:

father and son

చాలా సినిమాల్లో నాగేశ్వరరావు మరియు నాగార్జున కలిసి నటించడం జరిగింది. ఇద్దరు ఇద్దరే, కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, శ్రీరామదాసు, మనం సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు.

#5. కృష్ణంరాజు, ప్రభాస్:

father and son

కృష్ణంరాజు వారసత్వాన్ని ముందుకు దూసుకెళ్తూ ప్రభాస్ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ప్రభాస్ కృష్ణంరాజు కలిసి బిల్లా, రెబల్ సినిమాలు చేశారు. రాధే శ్యామ్ లో కూడా కృష్ణంరాజు ఒక పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది.

#6. చిరంజీవి, రామ్ చరణ్:

ram charan role duration in acharya movie

చిరంజీవి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ కింద రామ్ చరణ్ నటించాడు. అలానే రామ్ చరణ్ హీరోగా చేసిన బ్రూస్లీ లో చిరంజీవి గెస్ట్ రోల్ చేశారు. చిరుత లో కూడా ఒక పాట చేశారు. చిరంజీవి ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా నటించనున్నాడు.

#7. నాగార్జున, నాగచైతన్య:

samantha final decision regarding divorce

నాగార్జున నాగచైతన్య కలిసి మనం సినిమాలో నటించారు. అందులో నాగేశ్వరావు కూడా నటించారు.

#8. కృష్ణ , మహేష్ బాబు

బజార్ రౌడీ, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు సినిమాల్లో “కృష్ణ”, మహేష్ బాబు కలిసి నటించారు.