“ప్రియమైన కూతురుకి..” పెళ్లికి ఒక్కరోజు ముందు ఓ తండ్రి తన కూతురుకి రాసిన ఈ ఉత్తరం చదివితే కన్నీళ్లే..!

“ప్రియమైన కూతురుకి..” పెళ్లికి ఒక్కరోజు ముందు ఓ తండ్రి తన కూతురుకి రాసిన ఈ ఉత్తరం చదివితే కన్నీళ్లే..!

by Anudeep

Ads

పెళ్లి ఎవరి జీవితంలో అయినా సరికొత్త మార్పులను తీసుకొస్తుంది. పెళ్లి చేసుకున్న తరువాత ఏ అమ్మాయి అయినా తన కుటుంబ సభ్యులను వదిలి కొత్త కుటుంబంలోకి వెళ్లసిందే. అయితే.. ప్రతి కూతురుకి తన తండ్రితో గట్టి అనుబంధం ఉంటుంది. పెళ్లి అయ్యాక మరో ఇంటికి వెళ్లిపోవాలంటే.. ఆ తల్లి కూతుళ్ళ మధ్య తెలియని దూరం ఏర్పడినట్లు భయం కలగడం సహజం.

Video Advertisement

ఆ భయంలో.. తన కూతురు జాగ్రత్తగా ఉండాలన్న కోరికతో ఓ తండ్రి.. తన కూతురుకు ఇలా లేఖ రాసారు. ఓ తండ్రి తన కూతురుకు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలో.. అవి ఈ లేఖలో పేర్కొన్నారు.

father letter 1

“నా బంగారు తల్లీ..! రేపటి నుంచి నువ్వు నీ పేరు పక్కన నా పేరుని రాయడం మానేస్తావు. నువ్వు ఇష్టపడ్డ వ్యక్తితో నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కూడా కావాల్సింది. నేను నా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాను. ఇక, మీరు మీ బాధ్యతల్ని నిర్వర్తించాల్సిన సమయం దగ్గరపడింది. అందుకే మీకు కొన్ని విషయాలను చెప్పాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. నీకు గుర్తుందా..? నీవు గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో నీ కాలేజీ కి వచ్చి ఫీజు కట్టాను.

father letter 2

మీ ఫీజులు అన్ని నేనే కట్టానని మీరు అనుకుంటున్నారు కదా.. కానీ కాదు. ఆ సమయంలో ఉద్యోగరీత్యా నేను పతనమయ్యాను. ఆర్ధికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నాను. ఆ సమయంలో మీ ఫీజుల కోసం డబ్బుని మీ అమ్మే ఇచ్చింది. కానీ మీకు నా ద్వారానే ఇప్పించింది. మీ ఫీజులు నేనే కట్టాను అని మీరు అనుకోవాలని భావించింది. నాకు గౌరవం ఇవ్వడం కోసమే ఆమె అలా నడుచుకుంది. మీ అమ్మని చూసి ఈ విషయాలు మీరు నేర్చుకోవాలి.

father letter 4

మీ భర్తని మీరు గౌరవించండి. మీరు ఎంత ప్రేమించారు అన్న విషయాన్ని తెలియ చెయ్యాలంటే అతనికి మీరు ఇచ్చే గౌరవం ద్వారానే తెలియ చేయగలుగుతారు. ఒత్తిడి ఎక్కువ అయిన సందర్భాల్లో మీ భర్త విసుగు చెందుతూ ఉంటాడు. ఆ సమయంలో అతనికి బాసటగా నిలవండి. మీరు అతనితో విభేదించవచ్చు. గొడవపడచు. కానీ గౌరవం ఇవ్వడం మాత్రం మరిచిపోకండి.

father letter 3

మీ అమ్మని నేను కోప్పడప్పుడు ఏమి చేసేదో గమనించారా..? ఆమె సైలెంట్ గా ఉండేది. అలాగే.. ఆమె కోపం తెచ్చుకున్నప్పుడు నేను సైలెంట్ గా ఉండేవాడిని. ఒకరు వేడి మీద ఉన్నప్పుడు మరొకరు తగ్గడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే జీవితాంతం సుఖంగా ముందుకు వెళ్లగలుగుతారు. మీ భర్తకు ఇష్టమైన వాటిని ముందుగానే తెలుసుకోండి. అతని చేత అడిగించుకోవడం కాకుండా.. ముందుగానే సిద్ధం చేసి పెట్టండి. కొన్ని విషయాల్లో మీ భర్తని క్షమించండి. అది మీ భర్త మనసులో మీ స్థానాన్ని మరింత పదిలం చేస్తుంది.

father letter 5

ఓ సారి నేను మరో మహిళతో ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు మీ అమ్మ చూసింది. నేను ఆ సమయంలో భయపడ్డాను. ఎక్కడ ఆమె అరిచి గొడవ చేస్తుందో అని అనుకున్నాను. కానీ, మీ అమ్మ అక్కడనుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. నేను ఇంటికి భయపడుతూ వెళ్ళాను. నేను మీ అమ్మని తప్ప మరొకరితో సన్నిహితంగా ఊహించుకోలేదు. కానీ ఆరోజు నేను చేసింది తప్పేనని అనుకున్నాను. కానీ, ఇంటికి వచ్చాక మీ అమ్మ చాలా మాములుగా నన్ను క్షమించింది. నాకు అన్నం పెట్టింది.

father letter 6

నేను మాత్రం అపరాధ భావనలో మునిగిపోయాను. పశ్చాత్తాపం తో కుమిలిపోయాను. ఒకవేళ ఆమె అక్కడి మహిళతో గొడవపడి ఉంటె.. నేను ఆవేశంలో మీ అమ్మకి దూరమై ఆ మహిళకే దగ్గరయ్యేవాడినేమో.. కానీ, మీ అమ్మ నిశ్శబ్దం నన్ను తెలివితో ఆలోచించేలా చేసింది. కొన్నిసమయాల్లో నిశ్శబ్దం, ప్రేమ వంటివి గొడవ పడటం కంటే మంచి ఫలితాలను తీసుకొస్తాయి. నా ఉద్దేశ్యం మీకు అర్ధమైందనే భావిస్తాను. మీరు మీ భర్తకి మంచి భార్య గా ఉండాలి. మీకు ఈ తండ్రి అండ ఎప్పుడు ఉంటుంది. ఇక నుంచి మీకు మీ భర్తే సర్వస్వము. ఆ భగవంతుని ఆశీస్సులు మీతో ఎల్లప్పుడూ ఉంటాయని భావిస్తున్నాను.


End of Article

You may also like