Ads
ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సీ) తమిళ్ సినీ ఇండస్ట్రీలో తీసుకువచ్చిన కొత్త నిబంధనలు ప్రస్తుతం తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ నిబంధనల ప్రకారం తమిళ్ చిత్రాలలో కేవలం తమిళ్ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు మాత్రమే ఉండాలి. ఒకవేళ వీటిని ఉల్లంఘిస్తే తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా
ఫెఫ్సీ తెలియపరిచింది.
Video Advertisement
దేశంలో అతిపెద్ద చిత్ర పరిశ్రమల్లో కోలీవుడ్ కూడా ఒకటి. అంతేకాకుండా ఇతర భాషలకు చెందిన నటీనటులకు అవకాశం ఇవ్వడం లేదు అనే తన నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి అని ఫెఫ్సీ ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమణి పేర్కొనడం గమనార్హం.
జనరల్ గా మూవీస్ లో కొన్ని సన్నివేశాలు మరియు పాటల కోసం విదేశాల్లో షూట్ చేయడం అనేది ఎప్పటినుంచో అలవాటే. ఇలా ఫారిన్ లొకేషన్స్ లో షూటింగ్ చేసిన సాంగ్స్ కి మంచి డిమాండ్ కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన మొత్తం సినిమా తమిళనాడులోని చిత్రీకరించాలి అని ఫెఫ్సీ తమిళ్ సినీ ఇండస్ట్రీను ఆదేశించింది.
అంతేకాదు షూటింగ్ అనుకున్న సమయానికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావాలట.. ఒకవేళ అలా కాకపోయినా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టినా సంస్థకు రాతపూర్వకంగా కారణాలతో సహా నిర్మాతలు తప్పనిసరిగా తెలియజేయాలట. సినిమా యొక్క స్టోరీ కి డైరెక్టర్ కర్త ,కర్మ ,క్రియ…కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చినా బాధ్యత వహించాల్సింది డైరెక్టర్ అన్నది ఫెఫ్సీ వాదన. బయట పరిశ్రమల నుంచి వస్తున్న నటీనటుల జోక్యం కారణంగా ఫెఫ్సీ సభ్యులకు సినిమాలో అవకాశం రావడం లేదు..
అందుకే తమిళ్ సినిమాల షూటింగ్స్ తమిళనాడుకు దూరం అవుతున్నాయి అని ఫెఫ్సీ ఆరోపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ నిబంధనలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఇప్పటివరకు దీని పై కోలీవుడ్ అగ్ర నిర్మాతలు మరియు డైరెక్టర్స్ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఒకపక్క ఫిలిం ఇండస్ట్రీ పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్కి ఎదుగుతుంటే.. ఇలా నిబంధనలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది.
ALSO READ : అంత ట్రోల్ చేస్తున్నారు..! కానీ అసలు విషయం ఏంటో తెలుసా..?
End of Article