“ఆచార్య” లో “నీలాంబరి” పాత్రకి “పూజా” స్థానంలో మొదటగా ఏ హీరోయిన్ ని అనుకున్నారో తెలుసా.?

“ఆచార్య” లో “నీలాంబరి” పాత్రకి “పూజా” స్థానంలో మొదటగా ఏ హీరోయిన్ ని అనుకున్నారో తెలుసా.?

by Sunku Sravan

Ads

గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆచార్య సినిమా గురించి మాత్రమే వినిపిస్తోంది, కనిపిస్తోంది. స్టార్ హీరో సినిమా ఫ్లాప్ కావడంతో నెటిజన్లు చాలా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆ మూవీ యూనిట్ లో ఉండే ఒక్కొక్కరిని నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో పూజా హెగ్డేను కూడా కొంత మంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

Video Advertisement

బీస్ట్ సినిమా మరియు రాధేశ్యామ్ లాంటి మూవీస్ ఫ్లాప్ కావడంతో ఆచార్య మూవీ కూడా పూజా హెగ్డే ఫ్లాఫ్ ఖాతాలో చేరింది. ఈ మూవీలో నీలంబరి పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటమే కాకుండా పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. అయితే ఈ మూవీలో ఈ పాత్ర లేకున్నా సినిమాకు అంత నష్టమేమి జరిగేది కాదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలో పూజా హెగ్డే నటించిన పాత్రలో ముందుగా ఆ అవకాశం రష్మికాకు వచ్చింది కానీ రష్మిక మందన దీన్ని తిరస్కరించిందని సమాచారం. ఒకవేళ దీనికి రష్మిక ఓకే చెప్పి ఉంటే రష్మికా ఖాతాలో ఈ ఫ్లాప్ చేరేది. అయితే పూజా హెగ్డే కథా, కథనం ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు కామెంట్లతో చెబుతున్నారు.

పూజా హెగ్డే తర్వాత వచ్చే సినిమాలు మాత్రం ఫ్లాప్ అయితే ఆమె సినీ కెరీర్ నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అయితే మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో మూవీలో పూజా హెగ్డే కథానాయిక గా ఎంపికైన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపైనే ఈ అమ్మడు ఆశలు పెట్టుకున్నదని సమాచారం. రాధేశ్యామ్ మూవీ కి ముందు వరకు గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం చాలా డల్ అయిపోయిందని చెప్పవచ్చు.

 

 


End of Article

You may also like