రెండు, మూడు సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలో చూడవలసిన సినిమా అని, అది కూడా కేవలం యూత్ మాత్రమే కాకుండా, కుటుంబం అంతా చూడాల్సిన సినిమా అని చెప్పారు.

Video Advertisement

ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడారు. ఇలాంటి అంశాలను తెరపై చూడటం మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది.

naga chaitanya 1

ఈసారి “లవ్ స్టోరీ” తో శేఖర్ కమ్ముల సినిమా ప్రియులకి ఓ అద్భుతమైన అనుభూతిని మిగిల్చారని చెప్పాలి. అసలు ఈ సినిమా లో హీరో గా నాగచైతన్యను తీసుకోవాలి అని అనుకోలేదట. స్క్రిప్ట్ పూర్తి కాకముందే ఎవరైనా కొత్త హీరోలను తీసుకుంటే బాగుంటుంది అని శేఖర్ కమ్ముల భావించారట. కొత్తవాళ్లను పరిచయం చేస్తూ దాదాపు మూడొంతుల సినిమా ను పూర్తి చేశారట.

naga chaitanya 2

అయితే ఫుటేజీ చూసుకున్న తరువాత శేఖర్ కమ్ములకు అంత సంతృప్తి గా అనిపించకపోవడం తో ఎవరైనా తెలిసున్న వారిచేతే చేయిస్తే బాగుంటుంది అని అనుకున్నారు. అప్పటికి మెగా హీరో వైష్ణవ్ తేజ్ “ఉప్పెన’ తో ఫామ్ లో ఉన్నారు. దీనితో శేఖర్ కమ్ము ఆయనను సంప్రదించారు. వైష్ణవ్ తేజ్ కూడా మొదట శేఖర్ కమ్ముల తో నటించడానికి ఆసక్తి కనబరిచారు.

sekhar kammula

కానీ, తర్వాత ఆలోచిస్తే ఉప్పెన కూడా ప్రేమ కథ చుట్టూనే రూపొందింది. తిరిగి రెండో సినిమా కూడా అదే జోన్ లో వెళ్లడం సరికాదని వైష్ణవ్ తేజ్ భావించారు. అందుకే.. ఆయన సున్నితం గా శేఖర్ కమ్ముల ఆఫర్ ను తిరస్కరించారట. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ కొండపోలం సినిమా రిలీజ్ కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తప్పకుండ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు.