ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మనకి నచ్చిన సెలెబ్రిటీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది.

Surekha Vani Instagram story about bigg Boss entry

చూస్తుండగానే మొదటి వారం అయిపోవడానికి వచ్చింది ఈ వారం మొత్తం కొన్ని గొడవలతో అలాగే టాస్క్ లతో సాగింది. ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా చాలా వింతగా జరిగింది. ఒక కంటెస్టెంట్ ఏ కంటెస్టెంట్ ని అయితే నామినేట్ చేయాలి అనుకుంటున్నారో, వారి పేరు ఉన్న ట్రాష్ బ్యాగ్ ని తీసుకొచ్చి ఒక చెత్త కుప్ప లాంటి దాంట్లో వేస్తారు. అలా ఈ వారం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతారు అని ప్రజలు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.first contestant to eliminate in bigg boss telugu 5

ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్లే కంటెస్టెంట్ పేరు వచ్చేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో మొదటిగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మరెవరో కాదు మోడల్ జశ్వంత్ అలియాస్ జెస్సీ. ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంతవరకు ఆగాల్సిందే. ఇంక శనివారం, ఆదివారంహోస్ట్ కింగ్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్స్ తో మాట్లాడి వారి తప్పులు గురించి చెప్పి, అలాగే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరో చెప్తారు. అంతే కాకుండా వారు చేసిన మంచి విషయాలను కూడా నాగార్జున ఈ ఎపిసోడ్స్ లో చెప్తారు.