1942 లో వరల్డ్ వార్ టు వలన జపనీస్ దండయాత్రకు ప్రజలు భయ పడ్డారు. అప్పుడు
అక్కడ వాళ్ళు మద్రాసును విడిచి పెట్టి వెళ్లిపోయారు. స్టూడియో లో కేవలం ఒక ఉద్యోగి మాత్రమే వున్నారు. పరిస్థితి బాగుపడ్డాక షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది.

Video Advertisement

కన్నడ భాషలో హరిశ్చంద్ర సినిమాకి ఏవి మేయప్పన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆర్ నాగేంద్ర రావు గారు దర్శకత్వం వహించారు.

మైసూర్ మరియు కన్నడ మాట్లాడే ప్రాంతాల లో ఈ సినిమా పెద్ద హిట్ అయింది. వంద రోజులు ఈ సినిమా ఆడింది. శ్రీనివాస్ రాఘవన్ గారు ఈ సినిమా కి సౌండ్ అందించారు. ఎవరైనా సరే మరొక భాష లో లిప్ రీడింగ్ చేస్తే ఇంకో భాష లో మొత్తం సినిమాని తీసుకు రావచ్చు అని ఆయన భావించారు. డైలాగ్ ట్రాక్ ని ఒక భాష లో తొలగించి ఆ డైలాగ్స్ ని తమిళ్ భాష లోకి రాశారు. అయితే లిప్ మూమెంట్ కి కొన్ని పదాలు సరిపోవు అటువంటప్పుడు పదాలని మారుస్తారు.

ఒక సినిమాలో సౌండ్, పిక్చర్ రెండు కూడా సరిగ్గా కుదరకపోవడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. కానీ ఆయన పెట్టిన కష్టం ద్వారా ఆయనకి ఇది సక్సెస్ అవుతుందని అనిపించింది. పైగా ఆయన పడిన కష్టం చూసి చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమాకి ఆర్ సుదర్శన్ మ్యూజిక్ ని కంపోజ్ చేశారు.

అనువాదం అన్నీ కూడా సరిగా ఉండాలని కన్నడ దర్శకుడి ని తమిళ డైలాగ్ రైటర్ పక్కన కూర్చోబెట్టారు. అలానే కన్నడ నటీ నటులను తమిళం లో వాయిస్ కూడా ఇవ్వమని చెప్పారట. పగలు రాత్రి కష్టపడి యుద్ధకాల ఆంక్షలు వున్నా కూడా రీటేక్ లేకుండా డబ్బింగ్ పూర్తి చేసారు. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. గేమ్ ఛేంజింగ్ సినిమా అయ్యింది. ఈ విషయాన్ని avm స్టూడియోస్ కి చెందిన అరుణ గుహన్ సోషల్ మీడియా లో షేర్ చేసారు.