“బాహుబలి” సినిమాకి మొదట అనుకున్న కథ ఇది కాదా..? ఈ స్టోరీ కూడా మామూలుగా లేదుగా..?

“బాహుబలి” సినిమాకి మొదట అనుకున్న కథ ఇది కాదా..? ఈ స్టోరీ కూడా మామూలుగా లేదుగా..?

by Sunku Sravan

Ads

బాహుబలి తెలుగు ఇండస్ట్రీలో ఓ సంచలనం సృష్టించిన సినిమా.. ఈ మూవీ మొదటి పార్టు బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడు. అనే పాయింట్ ద్వారా రెండో పార్ట్ కి తీసుకొచ్చిన ఘనత రాజమౌళిది.

Video Advertisement

ఈ విధంగా రెండో పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులను కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూసేలా చేశాడు. అందుకే బాహుబలి మూవీ అంత భారీ విజయాన్ని అందుకుంది.

అయితే ఈ సినిమా కథ ఎలా పుట్టింది. దానికి రూపం ఎలా వచ్చింది అనేది విజయేంద్రప్రసాద్ వివరించారు. మొదట రాజమౌళి చెప్పిన ఈ సీన్ సినిమాలో లేదట. కేవలం కీలక విషయం మాత్రమే మూవీ లో ఉందట. సినిమాలో చూసిన దానికి కొంచెం భిన్నంగా లైను రాజమౌళికి చెబితే అక్కడి నుంచి కథను విస్తరించినట్లు విజయేంద్రప్రసాద్ వివరించారు. ఆ ఒక్క లైను సినిమాలో ఉన్న లైను రెండు ఒకే పాత్ర రిలేటెడ్ కావడం గమనార్హం.

బాహుబలి : స్టార్టింగ్లో సత్యరాజ్ సుదీప్ మధ్య వచ్చే సన్నివేశం గుర్తుందా. ఇద్దరి మధ్య కత్తి పైట్ జరుగుతుంది.. సినిమా అక్కడి నుంచే మొదలవ్వాలి.. ఆ సీను రాజమౌళికి విజయేంద్రప్రసాద్ చెప్పారని తెలుస్తోంది. కానీ వారు అనుకున్న సన్నివేశం వేరట. విదేశాల నుంచి ఆయుధాలతో వర్తకుడు మాహిష్మతి సామ్రాజ్యనికి వస్తారు.

ఆ టైంలో 80 సంవత్సరాలు ఉన్న పెద్దాయన పిల్లలకు కత్తిసాము నేర్పిస్తున్నాడు. అది చూసి మీరు చాలా గొప్ప వీరుడిలా ఉన్నారే అని మాట కలిపారు… మీకు బాహుబలి గురించి తెలుసా అని అడుగుతాడు. ఎవరు ఆయన అని ప్రశ్నించగా మేమిద్దరం కలిసి చాలా ఏళ్ళు సాధన చేశాం.. యుద్ధాలు చేశామని వివరిస్తాడు..

అలా ఓ సారి అడవిలో వెళుతుండగా 200 మంది ఒకసారి దాడి చేస్తారు. వాళ్లతో అతను యుద్ధం చేస్తూ ఉంటే మహాభారతంలో అర్జునుడు కూడా యుద్ధం ఇలాగే చేశాడేమో అని అనిపిస్తుంది. యుద్ధం అయిపోయే సరికి రక్తంతో తడిసి ముద్దయ్యారు. కానీ అతని శరీరం మీద ఉన్న ఒక్క రక్తపు చుక్క కూడా అతనిది కాదు.

ఎందుకంటే అతని ఒంటి మీద ఘాటు పెట్టగల వీరుడు ఇంకా పుట్టలేదు అంటూ ముసలాయన వర్తకుడికి వివరిస్తారు. మరి అంతటి వీరున్ని నేను ఒకసారి చూడాలని వర్తకుడు అడిగితే.. అతను చనిపోయాడు అంటాడు.. మరి ఆయనను ఎవరూ తాకలేరు అన్నావ్. అంటే అతన్ని నినే వెన్నుపోటు పొడిచాను.. అని చెప్పారు పెద్దాయన… ఆ తర్వాత సినిమా కథ ఎలా ముందుకు వెళ్లాలో ప్లాన్ చేశారట విజయేంద్రప్రసాద్..


End of Article

You may also like