RRR “ఒలీవియా మోరిస్” తో పాటు… తెలుగు సినిమాల్లో నటించిన 10 “విదేశీ” హీరోయిన్స్..!

RRR “ఒలీవియా మోరిస్” తో పాటు… తెలుగు సినిమాల్లో నటించిన 10 “విదేశీ” హీరోయిన్స్..!

by Anudeep

Ads

తెలుగు తెరపై తెలుగు నటీమణులు కనిపించడం తక్కువైపోయింది. ఎక్కువగా ముంబై భామలు తెలుగు లో టాప్‌ హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు. అలాగే తమిళ్, కన్నడ, మలయాళ అతివలు కూడా తెలుగు తెరను ఏలుతున్నారు. కానీ ఇప్పుడు ఇప్పుడు విదేశీ భామలు మన తెరపై వెలుగుతున్నారు. ఎక్కడో పుట్టి, ఇంకెక్కడో పెరిగిన పరదేశీయులు తెలుగు సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. అభిమానులను అలరిస్తున్నారు.

Video Advertisement

బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కొన్ని సార్లు అలా తెరపై మెరిసే వారు విదేశీ వనితలు. తర్వాత సింగీతం శ్రీనివాస రావు తెరకెక్కించిన ‘ అమెరికా అమ్మాయి’ చిత్రం లో ఫ్రెంచ్ డాన్సర్ అనిక్ చయమొటి ప్రధాన పాత్రలో నటించారు. తర్వాత రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘ పరదేశి’ చిత్రం లో మొనేట్ క్విక్ నాయికగా నటించింది. ఇలా కొన్నేళ్లుగా విదేశీ వనితలు తెలుగు తెరపై తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు వారెవరో చూద్దాం..

#1 కత్రినా కైఫ్

‘మల్లీశ్వరి’ చిత్రం తో తెలుగు వారికీ పరిచయం అయిన కత్రినా బ్రిటిష్ దేశస్తురాలు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది.

foregin actresses in tollywood movies..

#2 సన్నీలియోన్

పంజాబీ కుటుంబానికి చెందిన సన్నీ లియోన్ కెనెడా లో పుట్టి పెరిగింది. ఈమె తెలుగులో మంచు మనోజ్ సరసన ‘కరెంట్ తీగ’, మంచు విష్ణు సరసన ‘జిన్నా’ చిత్రాల్లో నటించింది.

foregin actresses in tollywood movies..

#3 అమీ జాక్సన్

‘ఎవడు’ చిత్రం తో టాలీవుడ్ కి పరిచయం అయిన అమీ జాక్సన్ బ్రిటిష్ దేశస్థురాలు. ఈమె అక్కడ నటి, మోడల్. తర్వాత ఆమె పలు భారతీయ చిత్రాల్లో నటించింది.

foregin actresses in tollywood movies..

#4 సవికా ఛాయవేజ్

సుమంత్ హీరోగా చంద్ర సిద్దార్థ తెరకెక్కించిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రం లో థాయ్ నటి సవికా హీరోయిన్ గా నటించింది.

foregin actresses in tollywood movies..

#5 క్రిస్టినా అఖీవా

ఆది సాయికుమార్ హీరో గా నటించిన గాలిపటం చిత్రం లో ఆస్ట్రేలియా నటి, మోడల్ క్రిస్టినా అఖీవా నటించింది.

foregin actresses in tollywood movies..

#6 ఒలీవియా మోరిస్

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం తో ఒలీవియా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈమె లండన్ కు చెందిన నాటక కళాకారిణి.

foregin actresses in tollywood movies..

#7 మరియా రాబోష్ప్క

జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించిన ‘ప్రిన్స్’ చిత్రం లో తమిళ్ హీరో శివ కార్తికేయన్ సరసన మరియా రాబోష్ప్క నటించింది.

foregin actresses in tollywood movies..

#8 నర్గిస్ ఫక్రి

గత కొంత కాలం గా బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న అమెరికన్ భామ నర్గిస్ ఫక్రి ‘ హరి హర వీర మల్లు’ చిత్రం తో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది. క్రిష్ దర్శకత్వం లో వస్తున్నా ఈ చిత్రం లో పవన్ కు జంట ఈమె నటిస్తోంది.

foregin actresses in tollywood movies..

#9 జెన్నిఫర్ పిచినెతో

విలక్షణ నటుడు సత్యదేవ్ నటించనున్న రాసుపరి చిత్రం లో బ్రెజిల్ కి చెందిన జెన్నిఫర్ పిచినెతో నటిస్తోంది. ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన ‘ రామ సేతు’ చిత్రం లో కూడా నటించింది ఈమె. ఈ చిత్రం లో సత్యదేవ్ కీలకపాత్రలో నటించాడు.

foregin actresses in tollywood movies..

#10 షెర్లీ షెటియా

నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రం ద్వారా న్యూజిలాండ్ నటి, గాయని షెర్లీ షెటియా టాలీవుడ్ లో అడుగు పెట్టింది.

foregin actresses in tollywood movies..


End of Article

You may also like