Home Information “శ్రీ రామ చంద్ర ఇన్స్టిట్యూషన్స్” లో ఉచిత ధ్యాన శిక్షణ.. ఎప్పుడంటే?

“శ్రీ రామ చంద్ర ఇన్స్టిట్యూషన్స్” లో ఉచిత ధ్యాన శిక్షణ.. ఎప్పుడంటే?

by Anudeep

ధ్యానం అనేది మనసుని నిర్మలంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం మనం బతుకుతున్న జీవిత విధానాలలో ఒత్తిడికి, మానసిక ఆందోళనకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే.. ఇటీవల ధ్యాన శిక్షణ కేంద్రాలు ఎక్కువ అయ్యాయి. అయితే.. వీటిల్లో చాలా సంస్థలు ధనార్జన ధ్యేయంగా పెట్టుకుంటున్నాయి.

meditation

ఇటువంటి రోజులలో కూడా.. చిన్న, పెద్ద వయసు తారతమ్యం లేకుండా.. అందరికీ ఉచితంగా ధ్యాన శిక్షణ అందించాలని “శ్రీ రామ చంద్ర ఇన్స్టిట్యూషన్స్” కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే వీరు ప్రతి నెలా.. నాలుగవ శనివారం మరియు ఆదివారం రోజు ఉచిత ధ్యాన శిక్షణను అందిస్తున్నారు. ఈ సందర్భంగా వీరు ఈ నెల 23 మరియు 24 వ తేదీలలో రెండు రోజుల ఉచిత ప్రాణాయామం, ధ్యాన శిక్షణను అందిస్తున్నారు.

meditation 1

ఇది 18 సంవత్సరాల వయసు నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న వారికి పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. హైదరాబాద్ లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన వారు 98492 54605 నంబరుకు సంప్రదించగలరు.

You may also like