Ads
ఇవాళ పొద్దున ఒక wedding invitation వచ్చింది . దాని మీద W/L 1 & W/L 2 అని వ్రాసి ఉంది . కుతూహలం ఆపుకోలేక పెళ్ళి వాళ్ళకి call చేశా…
“ఏందిరా ఈ waiting list యవ్వారం అని ?” వాడు చేప్పింది విని mind block అయ్యింది . “అయ్యా .. పెళ్ళికి ఆల్రెడీ ఓ 50 మందిని పిలిచాము ఇప్పటి దాకా .
మీ నెంబర్లు 51 మరియూ 52. ఎవరైనా పెళ్ళికి హాజరు కాలేని పరిస్థితి వస్తే మీ నెంబర్లు confirm అవుతాయి . అందుకే Waiting list 1, 2 అని రాసాను పెళ్ళికి ఓ రోజు ముందు మీ status update చేస్తాను . ధన్యవాదాలు .. #వాట్సప్
Video Advertisement
representative image
Also read: కరోనా పెళ్లి పత్రిక…లాస్ట్ లో హెచ్చరికలు హైలైట్!
ఇది ఇలా ఉండగా…లాక్ డౌన్ కారణంగా పెళ్లిలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ప్రముఖులు కొద్దిమంది సన్నిహితుల మధ్య పెళ్లిలు చేసుకుంటున్నారు. నిశ్చితార్థం జరిగి పెళ్లిళ్లు వాయిదా పడ్డ వారు చాలామందే ఉన్నారు. కరోనా నేపథ్యంలో వారి పెళ్లిళ్లు ఆగిపోయాయి. డిసెంబర్ వరకు ముహుర్తాలు లేవు అని కూడా కొందరు అంటున్నారు. మరి పెళ్లి కానీ ప్రసాదులు అప్పటివరకు వెయిట్ చేయాలి అనుకుంట.
representative image
ఒకవైపు కరోనాకి ఇంకా మందు కానీ వాక్సిన్ కానీ కనిపెట్టలేదు. దానికి సమయం కనీసం సంవత్సరం పట్టచ్చు అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆత్మ నిర్భర భారత్ అంటూ మనం కరోనాతో కలిసి జీవించాలి అంటూ తగిన షరతులుతో మునపటి జీవితాన్ని మొదలుపెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే చాలా వరకు పరిశ్రమలు దుఖాణాలు తెరుచుకున్నాయి.
representative image
ప్రజలు అందరు భౌతిక దూరాన్ని పాటిస్తూ , అవసరమైతేనే తప్ప బయటకి రావద్దు అంటూ హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం. మనం బయటకి వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరి. వీలైనంత వరకు కన్ను ముక్కు తాకకుండా ఉండాలి. ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఒకవేళ బయట ఏదైనా ముట్టుకున్నా వెంటనే శానిటైజర్ తో చేతిని శుభ్రపరుచుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే కరోనాని కొంత వరకు వ్యాప్తి చెందకుండా కట్టడి చేయచ్చు.
representative image
ఈ క్రమంలో పెళ్లి జరపడం కష్టమే. ఒకవేళ జరిగినా మునపటిలాగా ఆర్భాటాలు ఉండవు. ఈ కరోనా దెబ్బ సినీ పరిశ్రమపై కూడా పడింది. ఇకపై థియేటర్స్ లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. షూటింగ్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
End of Article