ఈ “గబ్బర్ సింగ్” నటి గురించి ఈ విషయాలు మీకు తెలుసా? తన తల్లి కూడా మనకు తెలిసిన నటే.?

ఈ “గబ్బర్ సింగ్” నటి గురించి ఈ విషయాలు మీకు తెలుసా? తన తల్లి కూడా మనకు తెలిసిన నటే.?

by Megha Varna

Ads

మన ఇండస్ట్రీలో హీరోలు కొంతమంది తమ తండ్రులు వేసిన బాటలో నడిచి ఎంతో కష్టపడి తమకంటూ ఒక గుర్తింపు సంపాదించింది తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటున్నారు.

Video Advertisement

అదేవిధంగా చాలామంది యాక్ట్రెస్ లు కూడా తమ తల్లులు నుండి వచ్చిన నటన వారసత్వాన్ని కొనసాగిస్తూ తల్లికి తగ్గ కూతురు అనిపించుకున్నారు. వారిలో గాయత్రీ రావు ఒకరు. గాయత్రీ రావు కంటే హ్యాపీ డేస్ లో అప్పు అంటే మనలో ఎక్కువ మందికి స్ట్రైక్ అవుతారు.

గాయత్రి రావు హ్యాపీ డేస్ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. తర్వాత ఆరెంజ్ సినిమాలో మాయ పాత్రలో నటించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ లో కూడా శృతి హాసన్ ఫ్రెండ్ గా కనిపించారు. గంగపుత్రులు సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు గాయత్రీ రావు.

హ్యాపీ డేస్ లో చేసిన అప్పు పాత్ర కి , ఆరెంజ్ సినిమాలో చేసిన మాయ పాత్ర కి, అలాగే గబ్బర్ సింగ్ లో చేసిన పాత్ర కి అస్సలు పోలిక ఉండదు. అందుకే  నటించింది కొన్ని సినిమాల్లో అయినా కూడా ఏ పాత్ర కి ఆ పాత్ర డిఫరెంట్ గా ఉండడంతో ఆడియన్స్ కి బాగా రిజిస్టర్ అయ్యారు గాయత్రీ రావు.  గాయత్రీ రావు తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఒక చిత్రంలో నటించారట.

గాయత్రి తల్లి పద్మ కూడా ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో సహాయ పాత్రల్లో నటించారు. హ్యాపీ డేస్ సినిమా లో కూడా నిఖిల్ తల్లి పాత్ర పోషించారు. గాయత్రీ రావు కి ఇటీవల పెళ్లి అయింది.

 

ఇప్పటికి కూడా ఎంతోమంది ప్రేక్షకులు అప్పు క్యారెక్టర్ గుర్తు పెట్టుకున్నారు అంటే, గాయత్రి ఎంత బాగా నటించారో అర్థం చేసుకోవచ్చు. కానీ తర్వాత వచ్చిన ఆరెంజ్ లాంటి సినిమాల్లో చేసిన పాత్రలు బాగున్నా కూడా గాయత్రి రావు యాక్టింగ్ ని హ్యాపీ డేస్ అంత బాగా ప్రూవ్ చేయలేకపోయాయి. ఒక మంచి పాత్రతో గాయత్రి రావు మళ్లీ మనల్ని అలరించాలని ఆశిద్దాం.


End of Article

You may also like