ఇంటర్ రిజల్ట్స్ లో జిల్లా టాపర్ గా నిలిచింది.. కానీ ప్రాణాలతో లేదు..కంటతడి పెట్టిస్తున్న సంఘటన!

ఇంటర్ రిజల్ట్స్ లో జిల్లా టాపర్ గా నిలిచింది.. కానీ ప్రాణాలతో లేదు..కంటతడి పెట్టిస్తున్న సంఘటన!

by Anudeep

Ads

విద్యార్థి దశలో ఉండగా.. బాగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అయ్యి.. తమ తల్లి తండ్రులకు అండగా నిలవాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. ఆ అమ్మాయి కూడా అలానే ఆశ పడింది. అందుకు తగ్గట్లే కష్టపడింది. తనను కన్న తల్లి తండ్రులకు పుత్రికోత్సాహం కలిగించడం కోసం ఎంతగానో కష్టపడింది. కానీ విధి వక్రీకరించింది. ఆమె ప్రాణాలను తీసుకెళ్ళిపోయింది.

Video Advertisement

కంటతడి పెట్టిస్తున్న ఈ ఘటన గద్వాల్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాలకు చెందిన నల్లన్నఅనే వ్యక్తి కుమార్తె రాజేశ్వరి.

rajeswari

ఆమె వయసు పద్దెనిమిది సంవత్సరాలు. ఆమె జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్మీడియట్ చదువుకుంది. రెండో ఏడాది ఇంటర్ చదువుకుంటున్న ఆమె మే 19 వ తేదీ పరీక్షలు ముగిసిన రోజున ఇంటికి బయలు దేరింది. ఆమె తండ్రి నల్లన్న ఆమెను బైక్ పై ఎక్కించుకుని గద్వాల్ నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే.. మార్గం మధ్యలోనే వారిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీనితో.. తండ్రీ కూతుర్లు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.

Also Read: ఆరేళ్ల కొడుకు కోసం టైంటేబుల్ సిద్ధం చేసిన తల్లి..! లాస్ట్ లో కండిషన్స్ హైలైట్.!

rajeswari 1

ఇటీవల మంగళవారం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ పరీక్షా ఫలితాలలో రాజేశ్వరికి ఎంపీసీలో 867 మార్కులు వచ్చాయి. జిల్లాలోని కేజీబీవీల్లో రాజేశ్వరి టాపర్ గా నిలిచింది. ఆమె టాపర్ గా నిలిచినప్పటికీ.. ఆమెను అభినందించడానికి రాజేశ్వరి ప్రాణాలతో నిలిచి లేదు. దీనితో ఆమె ప్రతిభ బయటకి రావడంతో ఆమెను తలుచుకుని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు మరింత దుఃఖభరితులవుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో నెటిజన్లను సైతం కంటతడి పెట్టిస్తోంది.

Also Read: 45 ఏళ్ళు దాటుతున్నా నటుడు సుబ్బరాజు పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..? కారణం తెలిస్తే షాక్ అవుతారు..!


End of Article

You may also like