ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నచిత్రం గేమ్ ఛేంజర్. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

Video Advertisement

ఈ చిత్రంలో హీరోయిన్లుగా అంజలి, కియారా నటిస్తున్నారు. ఈ మూవీ గురించి వచ్చే అప్డేట్స్ ఏవైనా క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఈ మూవీ గురించిన వార్త ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దానిపై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్స్ లో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్‌’ ఒకటి. ఈ చిత్రం పైన ప్రకటించినప్పటి నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్నిపాన్ ఇండియా మూవీ అనుకున్నారంత. రామ్ చరణ్ కి ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ మూవీని పాన్ గ్లోబల్‌ ఫిల్మ్‌ గా మారుతుందని కొందరు భావించారు. అయితే ఈ మూవీ ఎవరు ఊహించని విధంగా ఈ మూవీ రీజనల్ చిత్రంగా తెరకెక్కుతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దర్శకుడు శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గేమ్‌ చేంజర్ సినిమా రీజనల్ మూవీ అని ఫిల్మ్ నగర్ లో టాక్. అది కూడా ద్విభాషా చిత్రం అని, తెలుగుకు దగ్గరగా పూర్తి స్థాయి తమిళంలో తెరకెక్కుతున్న సినిమా అని వినిపిస్తోంది. రీజనల్ సినిమా అనే విషయం ప్రస్తుతం అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది ఎన్నో అంచనాల మధ్యన వచ్చిన  లైగర్ చిత్రంలో కూడా చాలావరకు హిందీనే ఉంటుంది. ఇపుడు గేమ్ ఛేంజర్ చిత్ర విషయంలో కూడా మేకర్స్ అదే తప్పు చేస్తున్నట్టుగా కామెంట్స్ వస్తున్నాయి.

Also Read: THE KERALA STORY REVIEW : “అదా శర్మ” నటించిన ది కేరళ స్టోరీ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!