Ads
తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆమె యూట్యూబ్ లో ఒక సంచలనం. మై విలేజ్ షో ద్వారా శ్రీకాంత్ ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.ఈమె పల్లె వాతావరణానికి సంబంధించిన అన్ని విషయాలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన బంధువుల సహాయంతో వీడియోలు చేస్తూ భారీగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
Video Advertisement
ఆ ఆదరణ కారణంగానే బిగ్ బాస్ లో కూడా ఆమెకు చోటు దక్కింది. కానీ పల్లెటూరికి చెందిన గంగవ్వ అది కూడా కాస్త వయసు ఎక్కువ ఉన్న గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది. బిగ్ బాస్ తో వచ్చిన రెమ్యూనరేషన్ ని ఉపయోగించుకొని ఒక ఇల్లు నిర్మించుకున్న గంగవ్వ ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలతో రెగ్యులర్ గా ప్రేక్షకులకు చేరువగా ఉంటుంది.
ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమెకు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అభిమానులుగా మారిపోయారు.ఈ క్రమంలోనే ఈమె క్రేజ్ దృష్టిలో పెట్టుకున్నటువంటి కొందరు దర్శక నిర్మాతలు తనకు పలు సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా కల్పించారు.
ఇకపోతే సాధారణంగా చిన్నచిన్న సెలబ్రిటీలకు నిర్మాతలు ప్రత్యేకంగా కేరవాన్ సదుపాయం కల్పించరు.కానీ గంగవ్వకు మాత్రం ప్రత్యేకంగా కేరవాన్ ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె షేర్ చేసుకున్నారు.ఇలా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే గంగవ్వ ఒక్కో సినిమాకు ఎంతవరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలోనే గంగవ్వ ఒకరోజు సినిమా షూటింగ్లో పాల్గొంటే సుమారు పదివేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమెకు భారీగానే ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఇలా యూట్యూబ్ ద్వారా ఈమె నెలకు ఏకంగా లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తున్నారని సమాచారం.
ఒకప్పుడు బీడీలు చుట్టుకొని, కూలీ పనులు చేసుకుని బతికిన గంగవ్వ ఇప్పుడు నెలకు అటు ఇటుగా లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతూ ఉంటారు.
కేవలం యూట్యూబ్ వీడియోలు కాకుండా అప్పుడప్పుడు సినిమాల్లో కూడా గంగవ్వ కనిపిస్తున్న విషయం తెలిసిందే. చిన్న చిన్న పాత్రలు చేస్తున్న గంగవ్వ భవిష్యత్తులో పెద్ద సినిమాల్లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి గంగవ్వ ఈ వయసులో సెలబ్రిటీ అయి సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.
End of Article