గంగవ్వ గురించి చాలా మందికి తెలుసు. బిగ్ బాస్ సీజన్- 4 లోకి వచ్చి గంగవ్వ అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు పాటు ఆమె హౌస్ లో ఉండి అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే ఈమె హౌస్ నుండి వెళ్ళిపోయినప్పుడు నాగార్జున ఆమెకి ఇల్లు కట్టిస్తానని చెప్పారు. బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు గంగవ్వ స్వయంగా తనికి ఇల్లు లేదని చెప్పింది. బిగ్ బాస్ లో వచ్చిన డబ్బులని ఇంటి కోసం ఖర్చు చేస్తానని కూడా ఆమె చెప్పింది.

Video Advertisement

అయితే ఆమెకి మధ్యలో అనారోగ్యం బాగోక పోవడంతో బిగ్ బాస్ ఇంటి నుండి వెళ్లిపోయింది. నాగార్జున తనకి ఇల్లు కట్టిస్తానని చెప్పారు. పైగా ఆ బాధ్యత నాది అని నాగార్జున గంగవ్వ కి చెప్పారు.

gangavva remunaration and income details..

పైగా గంగవ్వతో ఇల్లు కాత్తుక్కొ.. తాళం కూడా వేసుకో ఇప్పటిలా తాళ్లు కట్టక్కర్లేదు అని కూడా చెప్పారు. కోట్లాది మంది ప్రేక్షకుల ముందే మాట ఇచ్చారు నాగార్జున. రెండు బెడ్రూంలు, ఒక పెద్ద హాల్, ఒక పెద్ద కిచెన్, పూజ గది, మూడు బాత్రూంలు పైగా చుట్టు ప్రహారీ ఒక గేటు తో గంగవ్వ ఇల్లుని ఎంతో అందంగా కట్టించుకుంది. జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, లంబాడి పల్లి లో ఈ ఇల్లు ఉంది. అయితే నాగార్జున మాట ఇవ్వడం వల్లే గంగవ్వ ఇల్లు పూర్తి అయింది అని అంతా అన్నారు.

కానీ నాగార్జున ఇంటి కోసం కేవలం 7 లక్షల రూపాయలనే ఇచ్చారు. ఇంటి కోసం 20 లక్షల రూపాయలు ఖర్చు అయింది. కానీ కేవలం ఏడు లక్షలు నాగార్జున ఇచ్చారు. నాగార్జున సారు ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చారు కానీ 7 లక్షలు ఇచ్చారని గంగవ్వ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పింది. ఐదు వారాలు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాను దాంతో పది లక్షలు వచ్చాయి. దీనికి ఇంకో ఐదు లక్షలు వేసి ఇల్లు కట్టాను అని చెప్పింది గంగవ్వ. బిగ్ బాస్ ఇంటి నుండి అనవసరంగా వచ్చేసానని కూడా చెప్పింది గంగవ్వ. బిగ్ బాస్ ఇంట్లో తినడం పడుకోవడం తన వల్ల కాలేదని అంది.