“గంగోత్రి” హీరోయిన్ అదితి గుర్తుందా..? ఆమె వదులుకున్న సినిమాలేంటో తెలుసా..? ఆ డైరెక్టర్ అలా అనేసరికి..??

“గంగోత్రి” హీరోయిన్ అదితి గుర్తుందా..? ఆమె వదులుకున్న సినిమాలేంటో తెలుసా..? ఆ డైరెక్టర్ అలా అనేసరికి..??

by Mounika Singaluri

Ads

“గంగోత్రి” సినిమాను మర్చిపోయే వారు ఎవరు ఉండరు. అంతలా తెలుగు ప్రేక్షకులకు నచ్చేసింది గంగోత్రి. ఈ సినిమా అటు అల్లు అర్జున్ కి, ఇటు హీరోయిన్ అదితి అగర్వాల్ కి తొలి సినిమానే. తొలి సినిమాతోనే ఇద్దరు తమ నటనతో ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు.

Video Advertisement

ప్రస్తుతం బన్నీ స్టార్ హీరో గా తెలుగు ప్రేక్షకులని ఇంకా అలరిస్తున్నారు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగిన బన్నీ సినిమా జర్నీ మనందరికీ తెలిసిందే. ఇక అదితి అగర్వాల్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగానే ఉంది.

Also Read:   త్రివిక్రమ్ ని కాపీ క్యాట్ అని విమర్శించినా… ఈ విషయంలో మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే..!” అంటూ… ఓ అభిమాని రాసిన ఈ పోస్ట్ పై మీ అభిప్రాయం ఏంటి..?

aditi 1

“గంగోత్రి” సినిమా తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన అదితి అగర్వాల్ కు ఆ సినిమా తరువాత చాలానే ఆఫర్స్ వచ్చాయి. అదితి అగర్వాల్ ఆర్తి అగర్వాల్ కు సోదరి అన్న సంగతి చాలా మందికి తెలిసిందే. అప్పటికే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆర్తి అగర్వాల్ కు సోదరిగా అదితి అగర్వాల్ కూడా ఆ రేంజ్ కి చేరుతుంది అని అందరు అనుకున్నారు.

aditi 2

గంగోత్రి సినిమా కూడా బాగా హిట్ అవ్వడంతో.. ఆమె కెరీర్ కు డోకా లేదు అనుకున్నారు. కానీ, అదితి అగర్వాల్ తనకి వచ్చిన ఆఫర్స్ ని తిరస్కరిస్తూ వచ్చారు. బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినా వర్షం, శ్రీ ఆంజనేయం సినిమాలు కూడా తొలుత అదితి నే వరించాయట. అయితే ఈ అవకాశాలను వదులుకోవడం వెనుక కారణాలేంటో ఆ తరువాత అదితి ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

aditi 3

తొలుత అదితి శ్రీ ఆంజనేయం సినిమాను ఒప్పుకుంది. డేట్స్ కుదరకపోవడంతో వర్షం సినిమాను వదిలేసుకుందట. కానీ, “శ్రీ ఆంజనేయం” సినిమా షూటింగ్ కొన్ని రోజులు జరిగిన తరువాత “పూల గుమ గుమ చేరని” సాంగ్ షూటింగ్ ను ప్లాన్ చేశారట. ఈ పాట కోసం అదితి చాలా బోల్డ్ గా ఎక్సపోజ్ చేయాల్సి ఉంటుందని డైరెక్టర్ కృష్ణ వంశి చెప్పారట. అలా చెయ్యను అని చెప్పడంతో.. అక్కడినుంచి వెళ్లిపోండి.. ఈ సినిమాలో చేయొద్దు అని కృష్ణ వంశి అనడంతో ఆమె అక్కడనుంచి వెళ్లిపోయారట.

Also Read:     “జోష్” సినిమాలో సైడ్ ఆర్టిస్ట్… ఇప్పుడు హీరో అయ్యి “హ్యాట్రిక్ హిట్స్” కొట్టాడు..! అతను ఎవరంటే..?

 

అలా అదితి ఈ రెండు సినిమాలను వదిలేసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఛార్మి ఆ పాటలో నటించిన తీరు చూసి ఆ సినిమాలో నటించకపోవడమే మంచిది అయ్యింది అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది అదితి. సినిమా ఇండస్ట్రీ లో చాలామంది పేరు కోసం ఎలాంటి పాత్రని అయినా చేస్తుంటారు. కానీ, నచ్చని పని చేయడం కంటే.. అలాంటి పని చేస్తే వచ్చే పేరుని వద్దనుకుని అదితి సంతోషంగానే ఉంది.

Also Read:  “మేము సంతోషంగా బతకడం ఇష్టం లేదా…?” జానకి కలగలేదు హీరో “అమర్‌దీప్‌” కామెంట్స్..!


End of Article

You may also like