టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ని తీసుకు వచ్చారు. ఈ సినిమా మంచి హిట్ అవడమే కాదు అంతర్జాతీయ అవార్డ్స్ ని కూడా కైవసం చేసుకుంది. అంతర్జాతీయ పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు ని ఈ సినిమా అందుకోవడం జరిగింది. బెస్ట్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ రెండు క్యాటగిరీల్లో ఈ సినిమా నిలిచింది.

Video Advertisement

‘నాటు నాటు’ సాంగ్ అవార్డు కి అవార్డు వచ్చింది. ఈ విషయం తెలిసిందే. ఈ పాత కి చంద్రబోస్ లిరిక్స్ ని ఇచ్చారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీత దర్శకుడు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఇద్దరు ఈ పాటని పాడారు.

the story behind RRR 'natu natu' song..!!

అలానే ఈ పాట ఒరిజినల్ సాంగ్ విభాగం లో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఈనెల 13న 95వ అకాడమీ అవార్డులను ప్రకటించబోతున్నారు. ఆస్కార్ అవార్డు రావాలని కూడా అంతా కోరుకుంటున్నారు. ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు గారు కూడా కోరుకుంటున్నారు. నాటు నాటు పాట గురించి ఆయన ప్రవచనం లో భాగంగా మాట్లాడారు. ఆస్కార్‌కు నాటు నాటు పాట నామినేట్ అవడం సంతోషించాల్సిన విషయమని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.

is rajamouli planning for RRR sequel..??

నిన్నటి వరకు ఆ పాట గురించి నాకు తెలియదు. మా అబ్బాయి పిలిచి ఆ పాటేంటో పెట్టు అని అడిగి కూర్చుని విన్నాను అని చెప్పారు. ఎందుకు ఆ స్థాయికి వెళ్లిందో తెలుసుకోవాలి అని విన్నాను అని అన్నారు. అచ్చ తెలుగు పాట ఇంగ్లిష్ మాటలు లేవు ఆ పాట రాసిన చంద్రబోస్‌కి నమస్కారం అని గరికపాటి అన్నారు. అయన కుడికాలు తిప్పితే ఈయన కూడా కుడికాలే తిప్పాడు. భగవంతుడి దయవల్ల మార్చి 13వ తేదీన పురస్కారం వస్తే.. మనకంటే అదృష్టవంతులు ఇంకొకరు ఉండరని ఆయన అన్నారు.

అంతే కాక పురస్కారం రావాలని కాంక్షిద్దాం…. సరస్వతీ దేవిని పూజిద్దాం… గుడి కి వెళ్తే దండం పెట్టండి… పురస్కారం రావాలని అని అన్నారు. మనమంతా గర్వంగా తిరుగుతాం అని చెప్పారు ఆయన. కూడబలుక్కుని నటించడం కలవలకే సాధ్యం కాదు ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా చక్కగా నటించారన్నారు. వీళ్ళు ఇద్దరూ వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహానటులు అన్నారు.
అలానే నా కంటే చిన్నవాళ్లైనా ఇద్దరికీ నమస్కారం చేస్తున్నాను అని అన్నారు గరికపాటి.