“గీతా ఆర్ట్స్” బ్యానర్ కి ఈ పేరు ఎలా వచ్చింది..? దీని వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసా..?

“గీతా ఆర్ట్స్” బ్యానర్ కి ఈ పేరు ఎలా వచ్చింది..? దీని వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసా..?

by Harika

Ads

టాలీవుడ్ ఇండస్ట్రీలో గీత ఆర్ట్స్ గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. ఈ బ్యానర్ పై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎందరో హీరోలకు లైఫ్ ఇచ్చింది ఈ నిర్మాణ సంస్థ. చిన్న సినిమాలకి ప్రాణం పోయాలని ఉద్దేశ్యంతో గీతం బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు అల్లు అరవింద్.

Video Advertisement

అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉన్న గీత పేరు ఎవరిది అనే సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే చాలా రోజుల క్రితం స్వయంగా గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ డౌట్ ని క్లియర్ చేశారు.

geetha arts banner name meaning

అయితే ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇంతకీ అరవింద్ ఏమన్నారో చూద్దాం. ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అల్లు అరవింద్ ని గీత ఆర్ట్స్ లో ఉన్న గీత పేరు ఎవరిది, ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని ప్రశ్నించగా గీత అనేది నా గర్ల్ ఫ్రెండ్ పేరు కానీ ఆ పేరు ఆ బ్యానర్ కి పెట్టలేదు అని ముందుగా చమత్కరించారు అల్లుఅరవింద్. ఆ తర్వాత అసలు గీత అనే పేరు ఎందుకు పెట్టారో చెప్పారు.

allu aravind

1972లో గీత ఆర్ట్స్ సంస్థ ప్రారంభమైంది అయితే ఈ సంస్థని ప్రారంభించడానికి ముందు ఏం పేరు పెట్టాలా అని అల్లు రామలింగయ్య పలువురు తో చర్చలు జరుపుతున్న సమయంలో తానే ఆ సలహా ఇచ్చానని చెప్పారు. స్వతహాగా తన తండ్రి అల్లు రామలింగయ్య కి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ.

ఆయనకు భగవద్గీత పై విపరీతమైన నమ్మకం దాంతో భగవద్గీత లోని గీతా పేరును నిర్మాణ సంస్థకు పెట్టాలని సూచించారట. అయితే ఆ పేరు ఎందుకు పెట్టారో కూడా చెప్పారు అరవింద్. భగవద్గీత సారాంశం ఏమిటంటే పని చేయటమే నీ వంతు, ఫలితం పరిస్థితులను బట్టి వస్తుంది. అది సినిమా వాళ్లకి బాగా ఆప్ట్ అవుతుంది. ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీయటమే నిర్మాతల పని. సక్సెస్ అవ్వటం కాకపోవడం అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది అందుకే నా పేరు పెట్టాం అంటూ వివరించారు అరవింద్


End of Article

You may also like