Ads
జెనీలియా తెలుగు వారికి బాగా సుపరిచితురాలు అయిన నటి. “బొమ్మరిల్లు” లో హాసిని గా నటించి నవ్వించిన జెనీలియా ను ఎవరైనా అంత తొందరగా మర్చిపోగలరా..? జెనీలియా.. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకున్నాక.. మారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
Video Advertisement
బాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్స్ లిస్ట్ లో జెనీలియా, రితేష్ ల పేరు కచ్చితంగా ఉంటుంది. వీళ్లిద్దరి పెయిర్ చాలా క్యూట్ గా ఉంటుంది. నేడు వీరి కుమారుడు రియాన్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా జెనీలియా ఓ పోస్ట్ ను వేశారు. “నీ గురించి నాకు కోటి కలలు కోరికలు ఉన్నాయి.. కానీ నేను నీ కోరికలకు ప్రాముఖ్యం ఇస్తాను.. నువ్వు రెక్కలతో ఎగరాలనుకుంటే.. నీకు రెక్కలకింద గాలి గా మారి సపోర్ట్ ఇస్తాను. నువ్వు మొదటి స్థానంలో ఉండకపోతే, నేను నిరాశ పడను. నువ్వు చివరి స్థానంలో ఉన్నా కూడా.. నీ ప్రత్యేకతలను నేను గుర్తిస్తాను. నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే రియాన్..” అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
End of Article