RAJU YADAV REVIEW : “గెటప్ శ్రీను” హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

RAJU YADAV REVIEW : “గెటప్ శ్రీను” హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

జబర్దస్త్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు గెటప్ శ్రీను. గెటప్ శ్రీను ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. కానీ ఇప్పటి వరకు సహాయ పాత్రల్లోనే గెటప్ శ్రీను నటించారు. ఇప్పుడు మొదటి సారి హీరోగా గెటప్ శ్రీను రాజు యాదవ్ సినిమాలో నటించారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : రాజు యాదవ్
  • నటీనటులు : గెటప్ శ్రీను, అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్.
  • నిర్మాత : రాజేష్ కల్లేపల్లి, ప్రశాంత్ రెడ్డి
  • దర్శకత్వం : కృష్ణమాచారి. కె
  • సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్
  • విడుదల తేదీ : మే 24, 2024

raju yadav movie review

స్టోరీ :

రాజు యాదవ్ (గెటప్ శ్రీను) డిగ్రీ ఫెయిలవుతాడు. ఊళ్లోనే ఖాళీగా ఉంటాడు. ఒకరోజు క్రికెట్ ఆడుతున్న సమయంలో రాజు యాదవ్ ముఖానికి బాల్ తగులుతుంది. హాస్పిటల్ కి తీసుకు వెళ్లినప్పుడు కుట్లు వేస్తారు. అప్పుడు రాజు ముఖం నవ్వుతూ ఉండేలాగా ఉంటుంది. అది సరి చేయాలి అంటే నాలుగు లక్షలు అవుతాయి అని చెప్తారు. ఆపరేషన్ కి డబ్బులు లేకపోవడంతో రాజు అలాగే ఉంటాడు. ఒకరోజు రాజు స్వీటీ (అంకిత ఖారత్) ని చూసి ప్రేమలో పడతాడు. స్వీటీ అక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ లో పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు స్వీటీ రాజు యాదవ్ ని తిడుతుంది.

తర్వాత రాజు పరిస్థితి తెలియడంతో స్నేహం చేస్తుంది. స్వీటీకి హైదరాబాద్ లో జాబ్ వస్తుంది. దాంతో తన గురించి ఆలోచించొద్దు అని రాజుకి చెప్తుంది. కానీ రాజు స్వీటీ కోసం హైదరాబాద్ కి వెళ్తాడు. అక్కడ టాక్సీ డ్రైవర్ గా చేరుతాడు. కానీ తర్వాత రాజుకి తెలిసేది ఏంటి అంటే, స్వీటీ మరొక వ్యక్తిని ప్రేమిస్తుంది. అప్పుడు రాజు ఏం చేశాడు? అసలు స్వీటీ ఇలా ఎందుకు చేస్తుంది? స్వీటీ రాజుని ప్రేమించిందా? రాజు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

హీరో ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆమె వెంట పడడం, అప్పటికి హీరోయిన్ తనని ప్రేమించట్లేదు అని చెప్పినా కూడా తెలుసుకోకుండా ఆమె వెంట పడుతూ ఉండడం, తర్వాత ఆమె ఇంకొకళ్ళతో ప్రేమలో పడితే అప్పుడు తనని మోసం చేసింది అనుకోవడం, ఇదంతా చాలా సినిమాల్లో చూసాం. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఇదే కాన్సెప్ట్ చూపించారు. కాకపోతే హీరోకి ముఖంలో నవ్వు ఉంటుంది అని ఈ సినిమాకి ఒకటి యాడ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ ట్రాక్ తో నడిపించారు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ చూపించే ప్రయత్నం చేశారు. కొన్ని ఎమోషన్స్ అంత పెద్దగా కనెక్ట్ అయినట్టు అనిపించవు. కొన్ని సీన్స్ మాత్రం బాగా ఎమోషనల్ గా చూపించారు.

ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రాజు యాదవ్ పాత్రలో గెటప్ శ్రీను చాలా బాగా నటించారు. సినిమాకి తన 100% ఇచ్చారు. సినిమాకి ప్రధాన బలం అయ్యారు. కొన్ని సీన్స్ లో, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో గెటప్ శ్రీను నటన కంటతడి పెట్టిస్తుంది. హీరోయిన్ అంకిత కూడా అందంగా కనిపించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన పాటలు బాగున్నాయి. కొన్ని సీన్స్ అనవసరంగా పెట్టినట్టు అనిపిస్తాయి. ముఖ్యంగా హీరోయిన్ స్నేహితులతో వచ్చే సీన్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకున్న స్టోరీ పాయింట్ బాగున్నా కూడా కొన్ని సీన్స్ మాత్రం ప్రేక్షకులకు కన్విన్సింగ్ గా చూపించలేకపోయారు. ఈ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • గెటప్ శ్రీను
  • కొన్ని ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • తెలిసిన కథ
  • అనవసరమైన కొన్ని సీన్స్

రేటింగ్ : 

2.5/5

ట్యాగ్ లైన్ :

ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, కేవలం గెటప్ శ్రీను కోసం సినిమా చూద్దాం అనుకుంటే, రాజు యాదవ్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like