సినిమాలో ఫైట్స్, యాక్షన్, డైలాగ్స్, పాటలతో పాటు ముఖ్యమైన ఇంకొక ఎలిమెంట్ కామెడీ. అసలు కామెడీ వల్ల హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కామెడీ చేయాలి అంటే కామెడీ ఆర్టిస్ట్స్ కూడా చాలా ముఖ్యం. అలా ఎంతో మంది ఆర్టిస్ట్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన షోస్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ రెండు షోస్ కి మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

getup Srinu reply for the question about the skits

ఈ షోస్ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయిన ఆర్టిస్ట్ శ్రీనివాస్ అలియాస్ గెటప్ శ్రీను. సుడిగాలి సుధీర్ తో పాటు ప్రతీ శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా మనల్ని అలరిస్తారు గెటప్ శ్రీను. గెటప్ శ్రీను సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు.

getup Srinu reply for the question about the skits

అయితే గెటప్ శ్రీను ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ లో ఫాలోవర్స్ తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెగ్మెంట్ చేశారు. ఇందులో తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు శ్రీను. అయితే ఒక ఫాలోవర్ అడిగిన ప్రశ్న, అందుకు శ్రీను ఇచ్చిన జవాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

getup Srinu reply for the question about the skits

ఆ నెటిజన్ “మీ స్కిట్ కి ఒక సరైన కంక్లూషన్ ఉండదు. ఏంటో లాస్ట్ కి కొట్టేసుకుంటారు. ముందు బానే ఉంటుంది.” అని చెప్పగా అందుకు గెటప్ శ్రీను “నెక్స్ట్ టైం గుడ్ కంక్లూజన్ తో చేస్తాం థాంక్యూ” అని రిప్లై ఇచ్చారు. ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ద్వారా ఎంతో మంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు శ్రీను.