Ads
Skanda: తెలుగు బుల్లితెర పైన పలు ఛానెల్స్ లో ప్రసారం అవుతున్న సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పలువురు చైల్డ్ ఆర్టిస్టులు సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యారు. అలా పాపులర్ అయిన చైల్డ్ ఆర్టిస్టులు సినిమాలలో కూడా అవకాశాలు పొందుతున్నారు.
Video Advertisement
అలాంటి వారిలో జీ తెలుగులో ప్రసారమవుతున్న గుండమ్మ కథ సీరియల్ ద్వారా పాపులర్ అయిన చైల్డ్ ఆర్టిస్టు ఒకరు. ఆమె స్కంద మూవీలో నటిస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీలీల మాట్లాడుతున్న సమయంలో వేదిక పై కనిపించింది. దాంతో నెటిజెన్ల ఆమె ఎవరా అని వెతుకుతున్నారు. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
స్కంద మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించిన చైల్డ్ ఆర్టిస్టు పేరు మేఘనా సునీల్. ఆమె గుండమ్మ కథ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది. గుండమ్మ గా మేఘన అందంతో, నటనతో బుల్లితెర ఆడియన్స్ ఆకట్టుకుంటోంది. ఇంట్లోవారు ఆమెను మేగీ అని పిలుస్తారు. ఆమె స్వస్థలం విజయవాడ. ఆమె తండ్రి పేరు సునీల్, తల్లి పేరు శ్రీలక్ష్మి. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోందని తెలుస్తోంది.
ఆమె తండ్రి సునీల్ కు నటన పైన ఉన్న మక్కువ వల్ల, మేఘనకు కూడా నటన పట్ల ఇష్టం కలిగింది. ఈ రంగంలోకి అడుగుపెట్టింది. మేఘన సిటీ కేబుల్ లో యాంకర్ గా కూడా చేసింది. పలు ప్రకటనలలో నటించిన మేఘన, హీరో నాగార్జునతో కలిసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రకటనలో నటించింది. ఆమె జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ కోసం ఆడిషన్స్ కి హాజరు అవడంతో గుండమ్మ కథలో సీరియల్ లో పాత్రకు సెట్ అవుతుందని భావించి ఆ సీరియల్ లో తీసుకున్నారు.
ఆ సీరియల్ ద్వారా ఆడియన్స్ కి దగ్గరైన మేఘన ఆ తరువాత అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, అమ్మాయిగారు సీరియల్స్ అవకాశం వచ్చింది. ఆ తరువాత పలు సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి. దాంతో F3, ముఖచిత్రం, హిడింబా వంటి సినిమాలలో నటించింది. తాజాగా స్కంద మూవీలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక పక్క నటిస్తూనే స్టడీస్ కొనసాగిస్తోంది.
https://www.instagram.com/reel/CwxXTREJKuO/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: “బేబీ” మూవీలో “వైష్ణవి భర్త” గా నటించిన అబ్బాయి ఎవరో తెలుసా..?
End of Article