ఆనంద్ దేవ‌ర‌కొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం బేబి. ఇటీవల రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

Video Advertisement

ట్రయాంగిల్ ల‌వ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ వసూళ్లను సాధించి, రికార్డ్స్ ను సృష్టించింది. ఇక ఈ మూవీలో నటించిన నటీనటులకు మంచి గురింపు లభించింది. అయితే మూవీ చివరలో హీరోయిన్ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరా అని నెట్టింట్లో వెతుకుతున్నారు. మరి అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..
actor who acted as vaishnavi husband in babyబేబీ మూవీకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నటించిన వారందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి, ఎన్నో సినిమాలలో నటించినా రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చిన నటీనటులు చాలామంది ఉన్నారు. వారి గురించి మూవీ రిలీజ్ అయిన సమయంలో వైరల్ కూడా అయ్యారు. కానీ మూవీ క్లైమాక్స్ లో వైష్ణవి చైతన్య పెళ్లి చేసుకున్న నటుడు ఎవరు అనేది మాత్రం చాలా రోజుల వరకు తెలియలేదు. ఆ పెళ్లికొడుకు సెకన్లపాటే కనిపించినా బాగా వైరల్ అయ్యాడు.
ఆ అభాగ్యుడు ఎవరు? అంటూ సోషల్ మీడియాలో మీమ్స్‌ వచ్చాయి. అయితే బేబిని పెళ్లి చేసుకున్న నటుడు ఎవరో ఫైనల్‌గా తెలిసింది. ఆ నటుడి పేరు మల్లిడి కృష్ణ. తన నేటివ్ తూర్పు గోదావరి జిల్లా. అతను ఎవరో కాదు. బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ట సోదరుడు.
బేబీ అతని మొదటి సినిమా కాదు. ఎన్నో సినిమాలలో నటించాడు. మల్లిడి కృష్ణ కలర్‌ ఫోటో మూవీలో హీరో సుహాస్ కి సీనియర్ గా నటించాడు. కానీ అంతగా గుర్తింపు రాలేదు. డైరెక్టర్ సాయి రాజేష్ బేబీ మూవీలో హీరోయిన్ ను పెళ్లి చేసుకునే క్యారెక్టర్ ఇచ్చాడంట. సెకన్ల పాటు మాత్రమే కనిపించినా మల్లిడి కృష్ణకు మంచి గుర్తింపు వచ్చింది.

Also Read: SRIKANTH ADDALA: పెదకాపు సినిమాలో శ్రీకాంత్ అడ్డాల ఎందుకు నటించాల్సి వచ్చింది..? దీని స్టోరీ ఏంటంటే..?