గత కొన్నేళ్లుగా యూట్యూబ్‌లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ కు ఆడియన్స్ పట్టం కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎందరో ఫోక్ సింగర్స్ తమ పాటలతో అలరిస్తున్నారు. అదే సమయంలో పాపులర్ అవుతున్నారు. సినిమాలలో పాడేందుకు అవకాశాలను పొందుతున్నారు. 

Video Advertisement

అలాంటి సింగర్ మంగ్లీ. ఆమె తన యూట్యూబ్ ఛానెల్‌లో మూడేళ్ళ క్రితం ‘ఆడ నెమలి’ అనే పాట షేర్ చేయబడింది. ఈ పాటను ‘కనకవ్వ’ తో కలిసి మంగ్లీ పాడింది. ఈ సాంగ్ లో మంగ్లీతో ఆడి, పాడిన అమ్మాయి చాలా ఫేమస్ అయ్యింది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
‘ఆడ నెమలి’ పాట రిలీజ్ అయిన వారంలోనే ఏడున్నర లక్షల వ్యూస్ ని పొందింది. ఈ పాటలో మంగ్లీతో పాటు డ్యాన్స్ చేసిన అమ్మాయి కూడా పాపులర్ అయ్యింది. ఆమె పేరు జిమ్మిడి ఝాన్సీ. ఈ పేరు చెబితే గుర్తు పట్టలేకపోవచ్చు. కానీ జాను లిరీ అంటే చాలా మంది గుర్తు పడతారు. ఆమె సింగర్, కొరియోగ్రాఫర్, డాన్సర్.  తెలంగాణలోని కరీంనగర్‌లో జన్మించారు.
డివ డివ, గుట్ట గుట్ట తిరిగేటోడ’ అనే పాటలతో యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆడ నెమలి పాటతో మరింతగా ఫేమస్ అయ్యారు. జాను లిరీ టోనీ కిక్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ జంటకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఈ జంట విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. జాను లిరీ మ్యూజిక్ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తున్నారు. ఈ ఛానెల్ కు 137 k సబ్‌స్క్రైబర్‌లు ఉన్నాయి. అందులో తన పాటలను అప్‌లోడ్ చేస్తారు.
జాను లిరీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను 835 క్ ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాకుండా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పలు కమర్షియయల్ ప్రకటనలను పోస్ట్ చేస్తుంది. జాను లిరీ తాజాగా సింగర్ మంగ్లీతో కలిసి బతుకమ్మ పాటలో అలరించింది. 

 

Also Read: SAGILETI KATHA REVIEW : “నవదీప్” సమర్పణలో వచ్చిన “సగిలేటి కథ” ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!