Ads
తెలుగు సినిమా ప్రేక్షకులని ఆకట్టుకున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాల్లో ఒక సినిమా 7/G బృందావన్ కాలనీ. రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు.
Video Advertisement
ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా అందించిన పాటలు చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. పాటలకు ఇప్పటికి కూడా చాలా క్రేజ్ ఉంటుంది.
జీవితంలో అసలు ఎలాంటి ఆశయం లేని ఒక యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించాక అతని జీవితం ఎలా మారుతుంది? ఆ అమ్మాయి అతన్ని ప్రేమించిన తర్వాత వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఇలా ఒక బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా మొత్తం నడుస్తుంది. సినిమాలో హీరో హీరోయిన్లు పర్ఫెక్ట్ కాదు. అప్పట్లో ఈ విషయాన్ని దర్శకుడు చూపించడం అనేది చాలా ధైర్యమైన ప్రయత్నం. అందుకే ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్ అని అంటారు. అయితే ఈ సినిమా ఇటీవల తెలుగులో మళ్లీ రిలీజ్ అయ్యింది.
కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. ఈ సినిమాకి క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ ఏమో. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న విషయాలు కూడా పెద్దగా హైలైట్ చేసి చూపిస్తున్నారు. అలా ఈ సినిమాలో ఒక పాటకి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అదేంటంటే, సినిమాలో హీరో ఇంట్రడక్షన్ పాట అయిన మేం వయసుకు వచ్చాం పాటలో హీరో పక్కన ఒక అమ్మాయి డాన్స్ వేస్తూ కనిపిస్తుంది.
ఆ అమ్మాయి మరెవరో కాదు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ అని కొంత మంది ఈ పాటలో ఆ అమ్మాయి డాన్స్ వేస్తున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది విపరీతంగా సర్క్యులేట్ అయ్యి ఆ అమ్మాయి కాజల్ అగర్వాల్ అని అందరూ నమ్మే అంతగా పాపులర్ అయిపోయింది. చాలా మంది, “అసలు ఆ అమ్మాయి కాజల్ కాదు” అని అంటున్నారు. అయితే ఆ అమ్మాయి కాజల్ కాదు. అది నిజమే.
ఎందుకంటే కాజల్ ఒక హిందీ సినిమాలో ఐశ్వర్యా రాయ్ ఫ్రెండ్ గా నటించాక డైరెక్ట్ తెలుగులో హీరోయిన్ గానే నటించారు. కానీ ఆ పాటలో ఉన్న డాన్స్ చేసిన అమ్మాయి మరొక హీరోయిన్ అని అంటున్నారు. ఈ హీరోయిన్ కూడా మనకి తెలిసిన అమ్మాయి. తెలుగులో ఇద్దరమ్మాయిలతో, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో పాపులర్ అయిన కేథరిన్ ట్రెసా ఈ పాటలో డాన్స్ వేస్తున్న అమ్మాయి అని అంటున్నారు. కొంత మంది అయితే, “అసలు ఆ అమ్మాయి హీరోయిన్ కానే కాదు. కేవలం ఒక డాన్సర్ మాత్రమే” అని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో.
ALSO READ : “రాశి ఖన్నా” కి ఏమయ్యింది..? తెలుగు సినిమాలకి ఎందుకు దూరం అయ్యారు..?
End of Article