Ads
కొన్ని సార్లు మనం చేసే పొరపాట్లే మన ప్రాణం తీస్తుంటాయి. ఈ 19 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయి ప్రాణం కూడా అలానే పోగొట్టుకుంది. ఈ అమ్మాయి తల్లి చేసిన చిన్న పొరపాటు కారణంగా ఈ ప్రాణం పోయింది.
Video Advertisement
అసలేమి జరిగిందో చూద్దాం. ఈ బాలిక పేరు ఎమిమా జాక్లిన్. వయసు పందొమ్మిది సంవత్సరాలు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన ఈమె పొలాచ్చి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్‌లో బీకామ్ ఫైనలియర్ చదువుకుంటోంది.
ఈమె తల్లి శాంతి గ్రేసీ అనే మహిళ ఇంటి ముందే కిరానా కొట్టుని నడుపుతుంది. ఆమె కొట్లో పని చేసుకుంటూ ఇంటిని నెట్టుకొస్తోంది. ఆమె కూతురు ఎమిమా కూడా చాలా మంచి పిల్ల. చక్కగా చదువుకుంటూ.. కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక తల్లికి ఇంట్లో పనుల్లో సాయంగా ఉండేది. కాలేజీ అయ్యాక ఇంటికి వచ్చి వంట చేసుకుని చదువుకునేది.
రోజులానే ఆరోజు కూడా ఇంటికి వచ్చింది. కానీ మరోవైపు ఆమె తల్లి కిరానా కొట్లో ఎలుకలు ఎక్కువగా ఉండడం కారణంగా వాటిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఉన్న క్యారట్ లో కొన్నిటిలో ఎలుకల మందుని కలిపింది. అయితే ఈ విషయం తెలియని కూతురు ఆ క్యారెట్స్ ని కూడా కలిపి కూర వండేసింది. తనకి తెలియక ఆ క్యారట్ కూరని తిని చదువుకోవడం స్టార్ట్ చేసింది.
కానీ, కొంతసేపటికి ఆమెకి కళ్ళు తిరగడం మొదలైంది. ఉన్నట్లుండి వాంతులు అవడంతో ఆమెను ఆమె తల్లి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. అయితే చికిత్స తీసుకున్న తరువాత ఆమె మాములవ్వడంతో.. ఇంటికి తీసుకొచ్చేసారు. గండం గట్టెక్కింది అనుకున్నారు. కానీ ఫిబ్రవరి 1 వ తేదీన ఆమె మళ్ళీ అనారోగ్యానికి గురైంది. అయితే చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆమె శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. నేను నా కూతురుకి చెప్పకపోవడం వల్లే తను ఈరోజు బతికి లేదని ఆ తల్లి ఏడుస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టిస్తోంది.
End of Article