“నాలుగేళ్లు ప్రేమించుకున్నాక ఇలా జరిగింది..” అంటూ లెటర్ పంపిన ఓ అమ్మాయి..! తను చేసింది సరైనదేనా..?

“నాలుగేళ్లు ప్రేమించుకున్నాక ఇలా జరిగింది..” అంటూ లెటర్ పంపిన ఓ అమ్మాయి..! తను చేసింది సరైనదేనా..?

by Megha Varna

Ads

నేను ఇప్పుడు చాలా అయోమయంగా ఉన్నాను. ఏం చేయాలో తోచడం లేదు. నేను చదువుకున్న రోజుల్లో మా దగ్గర బంధువు అబ్బాయిని ప్రేమించాను. అతనికి కూడా నేనంటే ఎంతో ఇష్టం. ఇద్దరం కూడా నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నాం. అయితే మేము ప్రేమను గెలిపించుకుని.. పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాము. ఇంట్లో ఈ విషయం చెప్పే సరికి అమ్మ నాన్న అస్సలు ఒప్పుకోలేదు.

Video Advertisement

నేను ప్రేమించిన వ్యక్తి తరపు కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మా ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదు. అందుకే పెళ్లి వద్దు అంటున్నారు. ఎంత ఒప్పించిన సరే ససేమిరా నో అని అంటున్నారు. పైగా మా నాన్న ఆ అబ్బాయితో మాట్లాడే సరికి అతనికి చాలా కోపం వచ్చింది. అందుకే కనీసం మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడగడం లేదు. నిజంగా నేను ఎంతో బాధ పడుతున్నాను.

అలానే మా ఇద్దరి జాతకాలు తీసుకువెళ్లి ఒక సిద్ధాంతి గారికి చూపించారు. జాతకాలు కూడా కలవ లేదు. అందుకే పెళ్లికి ఒప్పుకోవడం లేదు అని చెప్పారు. అయితే నన్ను ప్రేమించిన వ్యక్తి కొన్ని రోజుల వరకు నాతో మాట్లాడలేదు. మళ్లీ కొన్ని నెలలు తర్వాత వచ్చి నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. మా అమ్మ వాళ్ళ పై కోపంతో.. వాళ్లకి తెలియకుండా నాతొ మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే మా అమ్మ నాన్నలని మోసం చేయాలని నాకు ఏమాత్రం లేదు. పైగా వాళ్లని మోసం చేస్తే నాకు గిల్టీగా ఉంటుంది.

అందుకనే నేను అతనితో మాట్లాడాలని అనుకోలేదు. పైగా అతన్ని వెళ్ళిపొమ్మని చెప్పాను. కన్న వాళ్ళని బాధపెట్టలేను అందుకనే నాకు అలా దొంగచాటుగా మాట్లాడాలని అనిపించడం లేదు. నిజంగా ఈ పరిస్థితి నాకు చాలా అయోమయంగా వుంది. మా అమ్మ నాన్నను నేను గుడ్డిగా నమ్మి అతన్ని ఏమైనా మోసం చేసానేమో అని బాధ వేస్తోంది. నేను చేసింది తప్పా..? ఒప్పా..? అనేది తెలియడం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలో తోచక మిమ్మల్ని అడుగుతున్నాను. నేను చేసింది తప్ప..? ఒప్పా..? మీరే నాకు సలహా ఇవ్వండి.


End of Article

You may also like