“సేవ్ ది టైగర్స్” వెబ్‌సీరీస్‌లో… “ప్రియదర్శి కూతురి”గా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

“సేవ్ ది టైగర్స్” వెబ్‌సీరీస్‌లో… “ప్రియదర్శి కూతురి”గా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

by Mohana Priya

Ads

ఈ మధ్య ఏదైనా వెబ్ సిరీస్ కానీ, సినిమా కానీ హిట్ అయితే దానికి రెండవ భాగం వస్తుంది. ఇటీవల అలా గతంలో విడుదల అయ్యి హిట్ అయిన ఒక వెబ్ సిరీస్ కి సెకండ్ పార్ట్ వచ్చింది. అదే సేవ్ ది టైగర్స్. అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, ప్రియదర్శి, దేవయాని, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల దీనికి సెకండ్ పార్ట్ విడుదల అయ్యింది. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ రెండవ భాగం ముగిసిన విధానం చూస్తే, దీనికి మూడవ భాగం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Video Advertisement

girl who acted as priyadarshi daughter in save the tigers web series

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. అయితే ఈ సిరీస్ లో నటించిన వారందరితో పాటు హైలైట్ అయిన మరొక వ్యక్తి, ప్రియదర్శి, జోర్దార్ సుజాత కూతురిగా నటించిన అమ్మాయి. సెకండ్ పార్ట్ లో ఆ అమ్మాయికి పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంది. సిరీస్ లో ఆ అమ్మాయి పేరు డింపుల్. నిజ జీవితంలో ఆ అమ్మాయి పేరు శ్రావ్య సంహిత. శ్రావ్య అంతకుముందు చాలా సినిమాల్లో నటించింది. 90 స్ వెబ్ సిరీస్ లో కూడా శివాజీ స్టూడెంట్ గా నటించింది.

girl who acted as priyadarshi daughter in save the tigers web series

ఇటీవల విడుదల అయిన తంత్ర సినిమాలో, అనన్య నాగళ్ళ చిన్నప్పటి పాత్రలో నటించింది. సామజవరగమన, గీత, జెమినీ టీవీలో ప్రసారం అయ్యే ఉప్పెన సీరియల్ లో కూడా శ్రావ్య నటించింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఉగ్రం సినిమాలో కూడా శ్రావ్య నటించింది. గతంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించింది. ఇప్పుడు శ్రావ్య సేవ్ ది టైగర్స్ సిరీస్ లో చెప్పిన ఒక డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. శ్రావ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ప్రాజెక్ట్స్ కి సంబంధించిన విషయాలని షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఇంస్టాగ్రామ్ లో కూడా రీల్స్ చేస్తూ ఉంటుంది.

watch video :

ALSO READ : చిరంజీవితో యమున కలిసి నటించిన ఈ సినిమా ఏదో తెలుసా? ఇద్దరి డాన్స్ హైలైట్.!


End of Article

You may also like