నాగార్జున ప్రస్తుతం ”ది ఘోస్ట్” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 5న రాబోతుంది ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

Video Advertisement

పైగా ఘోస్ట్ సినిమా లో విఎఫ్ ఎక్స్ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విఎఫ్ ఎక్స్ షాట్స్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని తెలుస్తోంది. నిజానికి 50% సన్నివేశాలు విఎఫ్ ఎక్స్ వర్క్ తో ఉన్నాయి.

కనుక ప్రేక్షకులు బాగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. పైగా ఈ చిత్తాన్ని పిల్లలు చూసే విధంగా యుఏ సెన్సార్ సర్టిఫికెట్ కోసం ప్లాన్ చేస్తున్నారు కూడా. అయితే గాడ్ ఫాదర్ సినిమాకు నాగార్జున ది ఘోస్ట్ సినిమా కూడా పోటీకి రానుంది.

సోనాల్ చౌహాన్ నాగార్జున సరసన నటిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి రహస్యాలు బయట పడలేదు. అయితే సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని కాన్ఫిడెన్స్ తో వుంది చిత్ర యూనిట్. అయితే మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా కి పోటీకి ఈ సినిమా రాబోతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. మరి గాడ్ ఫాదర్ కంటే ఘోస్ట్ పెద్ద హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

గాడ్ ఫాదర్ లో చిరంజీవితో పాటు సినిమాలో ఉన్న ముఖ్య నటీ నటులు కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సత్య దేవ్ కూడా ఈ సినిమా లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరూ కూడా టీజర్ లో కనిపించారు. గాడ్ ఫాదర్ సినిమా తో పాటు భోళా శంకర్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. అంతే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు.