Ads
తెలుగు తమిళ , కన్నడ చిత్ర పరిశ్రమలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు గోపి సుందర్.ఇప్పుడు ఉన్న సంగీత దర్శకులలో కర్నాటిక్ సాంప్రదాయ సంగీతంలో సుప్రసిద్ధులు గోపి సుందర్ అనే చెప్పాలి.తెలుగు చిత్రసీమకు “మళ్ళి మళ్ళి ఇది రానిరోజు” చిత్రం ద్వారా పరిచయం అయ్యారు గోపి సుందర్ కాగా ఈ చిత్రంలోని బాణీలు ప్రేక్షకులకు ఇప్పటికి అలరిస్తున్నాయి.తర్వాత విజయ్ దేవరకొండ ” గీత గోవిందం ” చిత్రానికి సంగీతం అందించారు గోపి సుందర్. ఈ చిత్రం విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది..దీంతో టాలీవుడ్ లో ఉన్న టాప్ సంగీత దర్శకుల లిస్టులో చేరారు గోపి సుందర్.
Video Advertisement
గోపి సుందర్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి అందరికి తెలిసిన ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.గోపి సుందర్ తన వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.గోపి సుందర్ 2001 లో ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.కాగా తర్వాత కొన్ని అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయారు.డివోర్స్ కోసం వీరిద్దరూ కోర్ట్ ను ఆశ్రయించారు.ప్రియా కూడా డివోర్స్ తీసుకోవడానికి సిద్ధం గా ఉన్నట్లు తెలుస్తుంది.కాగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.అయితే గోపిసుందర్ సింగర్ అభయ హిరణ్మయి మధ్య రిలేషన్షిప్ గురించి ఈ మధ్యకాలంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి.ఆ వివరాలేంటో చూద్దాం ..
గోపి సుందర్ స్వరపరిచిన బాణీలు ఎక్కువగా పాడిన సింగర్ అభయ హిరణ్మయి.వీరిద్దరూ బయట పబ్లిక్ ప్లేసులలో తిరుగుతూ మీడియాకి చాలాసార్లు చిక్కారు.అప్పట్లో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వచ్చాయి.కానీ అప్పట్లో ఈ విషయం గురించి వీరిద్దరూ నోరు మెదపలేదు.కానీ తాజాగా గోపి సుందర్ హిరణ్మయి కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ నా ఉనికికి నువ్వే కారణం అని పోస్ట్ చేసారు గోపి సుందర్. తర్వాత హిరణ్మయి కూడా ఈ విషయం గురించి చెప్తూ 2008 నుండి మేము సహజీవనం చేస్తున్నాం అని అధికారికంగా ప్రకటించారు.గోపిసుందర్ మ్యారేజ్ ఐన వ్యక్తే కానీ నాకు మాత్రం మ్యారేజ్ కాలేదు. గోపిసుందర్ నాకంటే 12 సంవత్సరాలు పెద్ద వ్యక్తి .కానీ మేము మా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాం అని పేస్ బుక్ ద్వారా తెలిపారు..కాగా ఈ పోస్ట్ ను గోపిసుందర్ భార్య ప్రియా షేర్ చేస్తూ అభినందనలు తెలపడం విశేషం…
End of Article