Ads
యాంకర్ భాను శ్రీ వివిధ ఛానెల్లలో బహుళ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ పెర్ఫార్మెన్స్ తో ఆమె చాలా మంది అభిమానులను గెలుచుకుంది. అందమైన మరియు ప్రతిభావంతులైన యాంకర్ గా అతి తక్కువ కాలంలో గుర్తింపు తెచ్చుకున్న యాంకర్లలో భానుశ్రీ ఒకరు. భాను శ్రీ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన నటనతో స్టైల్ తో అటు సినిమాల్లోనూ ఇటు బుల్లితెర పైన ఎన్నో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంట .
Video Advertisement
భాను శ్రీ కొన్ని టీవీ షోలు మరియు సినిమాల్లో నటించినప్పటికీ రాని పాపులారిటీ బిగ్ బాస్ షో పుణ్యమా అని వచ్చింది. బిగ్ బాస్ లో ఆమె చేసిన కామెంట్స్ ఆమె మిగతా కంటెస్టెంట్స్ తో ప్రవర్తించిన విధానం ఎప్పటికప్పుడు హైలైట్ అవుతూ వచ్చాయి. ఊహించని విధంగా బిగ్ బాస్ భాను శ్రీ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
వ్యక్తిగతంగా భాను శ్రీ ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్లేస్ సంపాదించుకోగలిగింది. తను ఇండస్ట్రీలో నిలబడడానికి , తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో కష్టాలు భరించానని ఆమె ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు వచ్చిన గుర్తింపుతో తను పడ్డ బాధలను అన్ని మర్చిపోగలుగుతున్నానని కూడా చెప్పింది.
భాను శ్రీ ఎక్కువగా ఈటీవీ ఈవెంట్స్ లో కనిపించి సందడి చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో ఈవెంట్ కి 30 నుంచి 50 వేలు వరకు భాను శ్రీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే భాను తన కెరీర్ మొదలు పెట్టక ముందు నుంచి తన ఫ్రెండ్ ని ప్రేమిస్తుందని… అతన్ని త్వరలో పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది.
అంతకుముందు ఇంటర్వ్యూలో భాను మాట్లాడుతూ ,” తన ఫ్రెండ్ తనకు కెరియర్ లో సెటిల్ అవ్వడానికి ఎంతో హెల్ప్ చేశాడని, అతని ఎప్పటికీ తన లైఫ్ లో మర్చిపోలేనని. ఎవరు సాయం చేయని సమయంలో అతను తనకు ఎంతో భరోసా ఇచ్చాడని” చెప్పింది. అంతే అప్పటినుంచి ఆ ఫ్రెండ్ ని భాను పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు.
End of Article