నిజంగా ఇలాంటి తండ్రులు ఉంటారా…!

నిజంగా ఇలాంటి తండ్రులు ఉంటారా…!

by Mounika Singaluri

Ads

ఏ తల్లిదండ్రుల కైనా తమ బిడ్డలు మంచిగా చదివి ఉన్నత స్థానంలో ఉండాలని అనుకుంటారు. దీనికోసం వాళ్లు ఎంతగానో ఆరాటపడుతూ వాళ్లకు కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటారు. పిల్లల విజయం సాధిస్తే తాము విజయం సాధించినట్లుగా ఆనందపడిపోతూ ఉంటారు. కానీ ఒక తండ్రి చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజంగా ఇలాంటి తండ్రులు ఉంటారా అని అనిపించక మానదు.

Video Advertisement

ప్రయాగ్ రాజ్ కు చెందిన ఈ తండ్రి తన బిడ్డ నీట్-2023 లో మంచి ర్యాంకు సాధించడం కోసం డైరెక్ట్ గా తానే రంగంలోకి దిగాడు. తన బిడ్డతో పాటు ఈయన కూడా పరీక్ష రాసి విజయం సాధించాడు. నీతో పాటు నేను చదివి పరిక్ష రాస్తా ఎవరికి మంచి ర్యాంక్ వస్తుందో చూద్దాం అంటూ కూతురితో కలిసి చదవడం మొదలుపెట్టాడు.

పూర్తి కథనంలోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ కు చెందిన డాక్టర్ ప్రకాష్ ఖైతాన్ పెద్ద న్యూరో సర్జన్. అతను 1992 ఎంట్రన్స్ లో మెడిసిన్ సీటు సంపాదించాడు. 1999లో పీజీ సీటు సాధించి ఎమ్మెస్ సర్జరీ చేసి 2003లో న్యూరో సర్జరీ చేశాడు. అంతేకాదు 2011లో 8 ఏళ్ల పాప మెదడు నుండి ఎనిమిది గంటల్లో 296 సిస్టులు తొలగించి గిన్నిస్ బుక్ లో రికార్డు సంపాదించాడు. అలాంటి వైద్యుడు తన కుమార్తె మిటాలి నీటి పరీక్షకు తగినంత సంకల్పంతో చదవడం లేదని గుర్తించాడు.

exams 1

ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఎంబిబిఎస్ ఎంట్రన్స్ రాసి సీటు కొట్టిన తండ్రి తనకోసం మరోసారి పరీక్ష రాస్తానంటే మిటాలి కి ఉత్సాహం వచ్చింది. డాక్టర్ గా బిజీగా ఉన్నప్పటికీ ఉదయం సాయంత్రం కూతురుతో పాటు కూర్చుని చదివేవాడు. సిలబస్ డిస్కస్ చేసేవాడు. ఏ ప్రశ్నలు ఎలా వస్తాయి అనేది ఇద్దరు చర్చించుకునేవారు. అలా మిటాలికి మెల్లమెల్లగా పుస్తకాల మీద ధ్యాస మళ్ళించాడు.

మే 7న జరిగిన నీట్ ఎంట్రన్స్ లో తండ్రి కూతుర్లకు వచ్చారు ఒక సెంటర్ వచ్చింది. ఇద్దరూ వెళ్లి పరీక్ష రాశారు. జూన్ లో ఫలితాలు వస్తే మిటాలికి 90% ప్రకాష్ కి 89% వచ్చింది. అడ్మిషన్స్ లో మిటాలికి మణిపూర్ లోని కస్తూరిబా మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఇప్పుడు ఈ తండ్రి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పిల్లల్ని చదివించడానికి పాత పద్ధతులు పనిచేయవని ప్రతి తల్లిదండ్రులు కొత్తగా ఆలోచించాలని సందేశాన్ని ఇస్తున్నాడు. నిజంగా ఇలాంటి తల్లిదండ్రులు గ్రేట్ కదా…!

 

Also Read:డిజాస్టర్ అనేది కూడా చాలా చిన్న పదం ఏమో..? ఈ సినిమా చూశారా..?


End of Article

You may also like