Ads
ఇటీవల కాలంలో చాలా సినిమాలు చాలా ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ తరహాలోనే స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ‘గ్రే’ సినిమా కూడా ప్రేక్షకులను అలరించబోతోంది.ఈ చిత్రానికి రాజ్ మదిరాజు దర్శకత్వం వహించగా..కిరణ్ కాళ్లకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Video Advertisement
ఎంతో ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ సినిమా స్పై త్రిల్లర్ గా తెరకెక్కుతోంది.
ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ ముది రాజు మాట్లాడుతూ.. గతంలో చాలా సందర్భాలలో మన దేశానికి సంబంధించిన ఎంతో మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనిపించకుండా పోయారు. వారి అదృశ్యం వెనుక గల కారణం ఫారెన్ ఇంటెలిజెంట్ ఏజెన్సీస్. ఈ ఈ సంఘటన నుండి పుట్టిన ఆలోచనే ఈ ‘గ్రే’ మూవీ.సాధారణంగా మంచిని తెలుపుగాను, చెడును నలుపుగాను చూస్తుంటాం. కాని ఆ రెండు కలర్స్ మధ్యలో కొన్ని వందల షేడ్స్ ఉంటాయి. ప్రతి ఆలోచన వెనుక మన ఆలోచనలకు కూడా అందని కొన్ని వింతైన ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా గ్రే.
దాదాపు 40 సంవత్సరాల తర్వాత బ్లాక్ అండ్ వైట్ సినిమా రాబోతోంది. ఈ సినిమా ఫస్టాఫ్ కాపీ చేసాము. సినిమా యూనిట్ మొత్తానికి బాగా నచ్చింది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా బాగా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈ సినిమాలో నటీనటుల అందరూ చాలా బాగా క్యారెక్టర్ కు న్యాయం చేశారనీ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
End of Article